ETV Bharat / city

మోసగాడి వల నుంచి తప్పించుకున్న వైకాపా ఎమ్మెల్యే - వైకాపా ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్​

వైకాపా ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్​ను ఓ చీటర్ బురిడీ కొట్టించాలని ప్రయత్నించాడు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాయితీతో రుణం ఇప్పిస్తానంటూ నమ్మబలికే ప్రయత్నం చేశాడు. అనుమానం వచ్చిన ఎమ్మెల్యే...వెంటనే సంబంధిత అధికారులతో చర్చించి జాగ్రత్త పడ్డారు.

ycp mla  Usha sree Charan
ycp mla Usha sree Charan
author img

By

Published : Sep 2, 2020, 2:13 AM IST

కేంద్ర పరిశ్రమల శాఖ పీడీనంటూ ఏకంగా ఎమ్మెల్యేనే మోసం చేసేందుకు యత్నించారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్‌కు ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి తనను తాను కేంద్ర పరిశ్రమలశాఖ పీడీనంటూ పరిచయం చేసుకున్నాడు. ఎమ్మెల్యేలు 25 లక్షల విలువైన చిన్నతరహా పరిశ్రమలు స్థాపించుకునేందుకు కేంద్రం ప్రభుత్వం 50 శాతం రాయితీతో రుణం ఇస్తుందంటూ నమ్మబలికాడు. సెక్యూరిటీ డిపాజిట్ కింద రెండున్నర లక్షలు జమ చేయాల్సిందిగా సూచించాడు. ఈ వ్యవహారంపై అనుమానం వచ్చి ఆమె... సంబంధిత శాఖ అధికారులతో చర్చించగా అలాంటి పథకాలు ఏమీ లేవని తెలిపారు. దీంతో ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ నెంబర్ ఆధారంగా విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి

పవన్ కల్యాణ్ విచారం... చంద్రబాబు దిగ్భ్రాంతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.