హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం 2021-2022 విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల ప్రవేశ పరీక్షలు, అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 117 కోర్సుల్లో 2,328 సీట్ల భర్తీకి ఈనెల 21 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. జులై 20 వరకు అవకాశం ఇచ్చారు.
17 ఇంటిగ్రేటెడ్, 46 పీజీ, 10 ఎంటెక్, 44 పీహెచ్‌డీ కోర్సులకు అడ్మిషన్లు జరుపుతున్నట్లు వర్సిటీ పేర్కొంది. ఈ ఏడాది కొత్తగా ఎంటెక్‌లో మోడలింగ్ అండ్ సిమ్యులేషన్, ఎంపీఏ మ్యూజిక్, పబ్లిషింగ్‌లో సర్టిఫికేట్ కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు విశ్వవిద్యాలయం పేర్కొంది.
దేశవ్యాప్తంగా 39 కేంద్రాల్లో ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నిమ్‌సెట్ మార్కుల ఆధారంగా ఎంసీఏ, గేట్ కౌన్సిలింగ్ ద్వారా ఎంటెక్, జేఈఈ పరీక్ష ఆధారంగా 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అడ్మిషన్లు జరుగుతాయని హెచ్‌సీయూ స్పష్టం చేసింది. మరిన్ని వివరాలకు వర్సిటీ వెబ్సైట్లో చూడాలని పేర్కొంది.
ఇవీచూడండి: కొవిడ్ వ్యాక్సినేషన్‌లో ఏపీ రికార్డు.. 10 లక్షల మందికిపైగా వ్యాక్సిన్లు