ETV Bharat / city

కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించిన రాజ్‌నాథ్‌సింగ్‌.. రేపు ప్రభాస్​ను కలవనున్న అమిత్ షా - Hyderabad Latest News

Rajnath Singh visits Prabhas house: కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌.. కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించారు. కృష్ణంరాజు మృతిపట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభాస్‌తో ప్రత్యేకంగా ముచ్చటించారు. రాజ్‌నాథ్‌సింగ్‌ వెంట కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్‌ కూడా ఉన్నారు.

Krishnam
Krishnam
author img

By

Published : Sep 16, 2022, 4:41 PM IST

Rajnath Singh visits Prabhas house: కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్​సింగ్‌ కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం ద్వారా కృష్ణంరాజు నివాసానికి చేరుకున్న ఆయన.. కృష్ణంరాజు మృతిపట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. కృష్ణంరాజు సతీమణి, కుమార్తెలకు నేతలు ధైర్యం చెప్పారు. కృష్ణంరాజు అనారోగ్యానికి కారణం ఏంటి? తీసుకున్న చికిత్సలపై ఆరా తీశారు. అనంతరం పార్టీలో కృష్ణంరాజు సేవలను ఆయన కొనియాడారు. కాసేపు ప్రభాస్‌తోనూ ప్రత్యేకంగా మాట్లాడారు. రాజ్​నాథ్​సింగ్​ వెంట కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్‌ ఉన్నారు.

అంతకుముందు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాజ్‌నాథ్‌సింగ్‌కు.. రాష్ట్ర భాజపా నాయకులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి రాజ్​నాథ్​సింగ్​ నేరుగా కృష్ణంరాజు నివాసానికి చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి జేఆర్​సీ కన్వెన్షన్​లో నిర్వహించిన కృష్ణంరాజు సంస్మరణ సభలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి నగరానికి వస్తున్న అమిత్​షా.. రేపు ప్రభాస్​ను పరామర్శించనున్నారు.

కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించిన రాజ్‌నాథ్‌సింగ్‌..

ఇవీ చదవండి :

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు.. పాల్గొన్న మంత్రులు

రాహుల్ పాదయాత్రకు విరాళాల కోసం దారుణం.. కూరగాయల వ్యాపారిపై దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.