ETV Bharat / city

పోలవరం నిర్వాసిత కుటుంబాలు.. 1.06 లక్షలు: రాజ్యసభలో కేంద్ర మంత్రి వెల్లడి

author img

By

Published : Jul 26, 2022, 8:16 AM IST

POLAVARAM: పోలవరం ప్రాజెక్టు కింద పునరావాసం కల్పించాల్సిన 1,06,006 కుటుంబాలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గుర్తించినట్లు కేంద్ర జల్‌శక్తిశాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్‌ టుడూ తెలిపారు. ప్రాజెక్టు కింద భూసేకరణ, సహాయ, పునరావాస కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే చేపడుతున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అదనపు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ప్రకటించిందని, అందువల్ల ప్రతి నిర్వాసిత కుటుంబానికి పైన పేర్కొన్న సౌకర్యాలతోపాటు రూ.10 లక్షల ప్యాకేజీ దక్కుతుందన్నారు. రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.

AP MPs in parlament
AP MPs in parlament

POLAVARAM: పోలవరం ప్రాజెక్టు కింద పునరావాసం కల్పించాల్సిన 1,06,006 కుటుంబాలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గుర్తించినట్లు కేంద్ర జల్‌శక్తిశాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్‌ టుడూ తెలిపారు. రాజ్యసభలో సోమవారం తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. పోలవరం ప్రాజెక్టు కింద భూసేకరణ, సహాయ, పునరావాస కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే చేపడుతున్నట్లు చెప్పారు. 2013 డిసెంబరు వరకు నిర్వాసితులకు 2005 నాటి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అమలు చేసినట్లు తెలిపారు. దానికింద ఒక్కో నిర్వాసిత కుటుంబానికి రూ.2.83 లక్షల ప్యాకేజీ, ఇంటిస్థలం ప్రతిపాదించినట్లు చెప్పారు.

2014 జనవరి నుంచి 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు సహాయ, పునరావాస ప్యాకేజీ కింద రూ.6.86 లక్షలు, ఇతర కుటుంబాలకు రూ.6.36 లక్షల సాయాన్ని ప్రతిపాదించినట్లు చెప్పారు. దీనికి అదనంగా అన్ని బాధిత కుటుంబాలకూ ఇంటి స్థలం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు కింద భూమి కోల్పోయే ఎస్సీ, ఎస్టీలకు అంతే సమానమైన భూమికానీ, లేదంటే రెండున్నర ఎకరాలు కానీ (ఏది తక్కువైతే అది) ఇవ్వాలని ప్రతిపాదించినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అదనపు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ప్రకటించిందని, అందువల్ల ప్రతి నిర్వాసిత కుటుంబానికి పైన పేర్కొన్న సౌకర్యాలతోపాటు రూ.10 లక్షల ప్యాకేజీ దక్కుతుందన్నారు.

విశాఖ ఉక్కుకు రూ.913 కోట్ల నికర లాభం

గత ఆర్థిక సంవత్సరంలో విశాఖ ఉక్కు కర్మాగారానికి రూ.913.19 కోట్ల నికర లాభం వచ్చినట్లు కేంద్ర ఉక్కుశాఖ సహాయమంత్రి ఫగన్‌ సింగ్‌ కులస్థే తెలిపారు. ఎంపీ కనకమేడల అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త ప్రభుత్వరంగ సంస్థల విధానాన్ని అనుసరించి వైజాగ్‌ స్టీల్‌లో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారు. ఈ సంస్థకు ఇనుప గనులు కేటాయించాలని కేంద్రం ఒడిశా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. 2020-21తో పోలిస్తే 2021-22లో ఈ స్టీల్‌ ప్లాంట్‌ వార్షిక టర్నోవరు 57% పెరిగినట్లు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్లాంటు టర్నోవర్‌ 2017-18లో రూ.16,618 కోట్లు, 2018-19లో రూ.20,844 కోట్లు, 2019-20లో రూ.15,819 కోట్లు, 2020-21లో రూ.17,980 కోట్లు, 2021-22లో రూ.28,214 కోట్లు నమోదైనట్లు చెప్పారు. ఉక్కు ఉత్పత్తి గత ఏడాదిలో 23% పెరిగినట్లు వెల్లడించారు.

విశాఖ పెట్రోలియం యూనివర్సిటీకి రూ.184 కోట్లు విడుదల

విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం వంగలి గ్రామంలో పెట్రోలియం యూనివర్సిటీ నిర్మాణానికి రూ.655.46 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసినట్లు కేంద్ర పెట్రోలియంశాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తెలి తెలిపారు. దీనికి ఏపీ ప్రభుత్వం 201 ఎకరాలు కేటాయించగా ఇప్పటివరకు 157.36 ఎకరాలు ఆ సంస్థకు అప్పగించినట్లు చెప్పారు. క్యాంపస్‌ నిర్మాణానికి రూ.184 కోట్లు విడుదల చేశామని, 2022-23 బడ్జెట్‌లో రూ.150 కోట్లు కేటాయించామని వెల్లడించారు.

భారతీయ భాషల ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు ప్రతిపాదన లేదు

* ఏపీలో భారతీయ భాషల ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు ప్రతిపాదన ఏమీ లేదని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్‌ సర్కార్‌ తెలిపారు. భారతీయ భాషల కేంద్ర సంస్థ ఆధ్వర్యంలో తెలుగు భాషను ప్రోత్సహించడానికి ప్రాచీన తెలుగు విశిష్ట కేంద్రాన్ని (సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌) మైసూరు నుంచి నెల్లూరుకు తరలించినట్లు చెప్పారు. కొత్తగా ఎక్కడా భారతీయ భాషల కేంద్రం ఏర్పాటు ప్రతిపాదన లేదని చెప్పారు.

రైతులను సిబిల్‌ స్కోర్‌ అడగలేదు

పంట రుణం మంజూరుకు సిబిల్‌ స్కోరు కావాలని ప్రకాశం జిల్లాలో రైతులను ఒత్తిడి చేయలేదని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భాగవత్‌ కరాడ్‌ తెలిపారు. ఆయన లోక్‌సభలో వైకాపా ఎంపీ మార్గాని భరత్‌ అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. అలా ఒత్తిడి చేసినట్లు తమ దృష్టికేమీ రాలేదని ఏపీ స్టేట్‌ లెవెల్‌ బ్యాంకర్స్‌ కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) చెప్పిందని తెలిపారు.

పెట్రోలియం సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీలో ఏపీకి రూ.1,610 కోట్లు

పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం కొండంత వసూలుచేసి రాష్ట్రాలకు గోరంత పంచుతోంది. ఈ విషయం సోమవారం లోక్‌సభలో కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి ఇచ్చిన సమాధానం ద్వారా వెలుగులోకి వచ్చింది. 2021-22లో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ డ్యూటీ రూపంలో రూ.3,63,305 కోట్లు వసూలు చేసింది. అయితే రాష్ట్రాలకు రూ.35,966.94 కోట్లు (9.89%) మాత్రమే పంపిణీ చేసింది. ఇందులో ఏపీకి రూ.1,610.24 కోట్లు, తెలంగాణకు రూ.898.91 కోట్లే దక్కాయి.

60% గ్రామీణ ఇళ్లకు కుళాయి నీరు

ఏపీలో ప్రస్తుతం 60.06% ఇళ్లకు కుళాయినీటి సౌకర్యం కల్పించినట్లు కేంద్ర జల్‌శక్తిశాఖ సహాయమంత్రి ప్రహ్లాద్‌ పటేల్‌ తెలిపారు. సోమవారం రాజ్యసభలో వైకాపా సభ్యులు బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. రాష్ట్రంలోని 95.69 లక్షల గ్రామీణ ఇళ్లలో 57.47 లక్షల ఇళ్లకు కుళాయినీరు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. మిగిలిన కుటుంబాలకు 2024 కల్లా అందించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రానికి 2021-22లో రూ.3,182 కోట్లు కేటాయించగా, 2022-23లో ఆ మొత్తాన్ని రూ.3,458 కోట్లకు పెంచినట్లు తెలిపారు.

అమృత్‌ రెండోదశలో 124 పట్టణాల చేరిక

అమృత్‌ పథకం రెండోదశ కింద ఆంధ్రప్రదేశ్‌లో 124 పట్టణాలను చేర్చినట్లు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ సహాయమంత్రి కౌశల్‌ కిశోర్‌ తెలిపారు. రాజ్యసభలో వైకాపా ఎంపీ మోపిదేవి వెంకటరమణ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. అమృత్‌ తొలిదశ కింద రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ఇప్పటివరకు 3.93 లక్షల ఇళ్లకు కుళాయి నీటి సౌకర్యం, 3.85 లక్షల మురుగునీటి కనెక్షన్లు ఇచ్చినట్లు చెప్పారు. అమృత్‌ కింద కేంద్ర సాయం కింద రూ.1,056 కోట్లు ఇవ్వాలని నిర్ణయించగా, రూ.866 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. అమృత్‌ రెండో దశ కింద ఏపీకి రూ.3,158 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

1,412 చ.కి.మీ. అడవి విస్తరణ

2019లో ఏపీలో 1,412, తెలంగాణలో 966 చదరపు కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం విస్తరించినట్లు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ వెల్లడించారు. ఆయన సోమవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు బదులిచ్చారు. జాతీయ అటవీ నివేదిక-2021 ప్రకారం 2019 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో అటవీ విస్తీర్ణం 29,783 చదరపు కిలోమీటర్లు, అటవీ, వృక్ష విస్తీర్ణం 34,463 చదరపు కిలోమీటర్ల మేర ఉన్నట్లు చెప్పారు. తెలంగాణలో అటవీ విస్తీర్ణం 21,214 చ.కి.మీ., అటవీ, వృక్ష విస్తీర్ణం 24,062 చ.కి.మీ. మేర ఉన్నట్లు వెల్లడించారు.

శ్రీసిటీ ట్రిపుల్‌ ఐటీలో 18 పోస్టుల ఖాళీ

శ్రీసిటీ ట్రిపుల్‌ ఐటీకి కేటాయించిన 53 పోస్టుల్లో 18 ఖాళీగా ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. ఆయన సోమవారం లోక్‌సభలో వైకాపా సభ్యులు వల్లభనేని బాలశౌరి, లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. కాంట్రాక్టు సిబ్బంది ద్వారా ప్రస్తుతం ఈ ఖాళీల లోటును అధిగమిస్తూ వస్తున్నట్లు తెలిపారు.

కేంద్రీయ విద్యాలయాల్లో ఏపీలో 658 టీచర్‌ పోస్టుల ఖాళీ

కేంద్రీయ విద్యాలయాల్లో ఆంధ్రప్రదేశ్‌లో 658, తెలంగాణలో 602 టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి అన్నపూర్ణా దేవి తెలిపారు. ఆమె సోమవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు బదులిచ్చారు. ప్రస్తుతం ఏపీలో 518 మంది, తెలంగాణలో 454 మంది కాంట్రాక్ట్‌ టీచర్లు పనిచేస్తున్నట్లు చెప్పారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.