ETV Bharat / city

ఊహించని రీతిలో సివిల్స్ ప్రశ్నాపత్రం.. ఆశ్చర్యంలో అభ్యర్థులు - Indian Civil Services 2020 Prelims

దేశానికి ఆర్ధిక సంక్షోభం రాకుండా ఎలా నివారించాలి.. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ఏం చేయాలి.. ఇవన్నీ ఏంటనుకుంటున్నారా.. సివిల్స్ పోటీ పడుతోన్న అభ్యర్థులకు పరీక్షలో అడిగిన ప్రశ్నలు. పలు విభిన్న అంశాల్లో ఆలోచనాత్మకంగా, లోతుగా ప్రశ్నలు సంధించడంతో అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. అన్ని అంశాలకు సమ ప్రాధాన్యం ఉంటుందని ఆశించిన అభ్యర్థులకు నిరాశే మిగిలింది. ఈసారి ప్రశ్నల్లో బయాలజీ , సైన్స్ అండ్ టెక్నాలజీకి అధిక ప్రాధాన్యత ఇచ్చింది యూపీఎస్​సీ. ఊహించిన అంశాలకు ప్రాధాన్యత లేకపోవడం అభ్యర్థులకు నిరాశ మిగిల్చింది. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్​పై పరీక్షలో ఒక్క ప్రశ్న కూడా రాకపోవడం, ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం అభ్యర్థులను నిరుత్సాహానికి గురిచేసింది.

ఊహించని రీతిలో సివిల్స్ ప్రశ్నాపత్రం.. ఆశ్చర్యంలో అభ్యర్థులు

author img

By

Published : Oct 5, 2020, 8:20 AM IST

రాష్ట్రంలో యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 30 వేలకుపైగా అభ్యర్థులు పరీక్షలు రాశారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, తదితర ఉద్యోగాల నియామకం కోసం దేశవ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించారు.

జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాల్లో..

రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాల్లో యూపీఎస్​సీ పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసింది. ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు జనరల్ అవేర్​నెస్​, మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు మరో పరీక్ష నిర్వహించారు.

దేశవ్యాప్తంగా సుమారు 8 లక్షల మంది హాజరయ్యారని యూపీఎస్​సీ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30వేల మంది పరీక్షకు హాజరుకాగా విశాఖ, విజయవాడ, తిరుపతి, అనంతపురంల్లో 68 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. విజయవాడలోనే 12 వేల 533 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా.. 27 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

అవాంఛనీయానికి తావు లేకుండా..

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు, నిఘా ఏర్పాటు చేశారు. కారోనా వ్యాప్తి చెందకుండా కేంద్రాల వద్ద ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పరీక్షకు గంట ముందే కేంద్రంలోకి అనుమతించారు. మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేశారు.

అన్నీ ఓకే అనుకుంటేనే..

సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి తనిఖీలు చేశారు. అభ్యర్థులకు కారోనా లక్షణాలు లేవని నిర్ధారించాకే కేంద్రాల్లోకి అనుమతించారు. కారోనా లక్షణాలు ఉన్నవారికి, ప్రత్యేక గదిని ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. కేంద్రాల్లో భౌతిక దూరం పాటించేలా సీట్లు కేటాయించారు.

అభ్యర్థుల భిన్నాభిప్రాయాలు..

సివిల్స్ ప్రశ్నాపత్రంపై అభ్యర్థులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కరెంట్ అఫైర్స్ అంశాల్లో ఆశించిన రీతిలో ప్రశ్నలు రాలేదని కొందరు నిరుత్సాహం వ్యక్తం చేశారు. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాపై ప్రతిష్టాత్మక సివిల్స్​లో ప్రశ్నలు తప్పనిసరిగా వస్తాయని ఊహించి ప్రిపేర్ అయ్యామన్నారు. తీరా ప్రశ్నపత్రం చూస్తే ఆయా అంశాలపై ప్రస్తావనే లేదని అభ్యర్థులు విస్మయం వ్యక్తం చేశారు.

వారికే అనుకూలం..

ఆర్ధిక పరమైన అంశాలకే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల బీటెక్ సహా సాంకేతిక విద్య అభ్యసించిన అభ్యర్థులు ఇబ్బంది పడ్డట్లు తెలిపారు. బయోలాజికల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయని స్పష్టం చేశారు.

అందువల్ల ఇబ్బందిపడ్డాం..

కొవిడ్ వ్యాప్తితో కోచింగ్ కేంద్రాలు మూతపడటంతో ప్రిపరేషన్​కు ఇబ్బంది పడ్డామని.. దీని కారణంగా మార్కులు తగ్గాయని కొందరు వాపోయరు. ఏది ఏమైనా గతంతో పోల్చితే ఈసారి ప్రశ్నాపత్రం కష్టంగా, విభిన్నంగా వచ్చిందనే అభిప్రాయాన్ని చాలా మంది అభ్యర్థులు వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి : అత్తారింటి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.