Ugadi celebrations: శుభకృత్ నామ సంవత్సర ఉగాది ఉత్సవాలకు ఏపీ భవన్ ముస్తాబైంది. మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలతో భవనాన్ని అలంకరించారు. ఈ ఏడాది రెండు రోజులపాటు.. ఉగాది ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఇవాళ సాయంత్రం.. వేద పండితులచే పంచాంగ శ్రవణం, అరకు గిరిజన కళాకారులచే థింసా నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. రేపు సురభి కళాకారులు.. మాయా బజార్, శ్రీనివాస కళ్యాణం, పౌరాణిక నాటకాలు ప్రదర్శించనున్నారు. ఏపీ భవన్ లో జరిగే ఉగాది ఉత్సవాలకు హజరయ్యే ప్రవాసాంధ్రులకు.. అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి, కాణిపాకం దేవస్థానాల ప్రసాదాలు, ఉగాది పచ్చడి, ఆంధ్ర సంప్రదాయ విందు భోజనం అందించనున్నారు.
Ugadi celebrations: ఏపీ మార్క్ ఫెడ్, ఆప్కోస్, డ్వాక్రా, గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్, లేపాక్షి సంస్థలు తయారు చేసిన ఆంధ్రా రుచులు, పిండి వంటలకు సంబంధించిన స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఉగాది ఉత్సవాలకు హాజరయ్యే వారి కోసం.. ట్రిపుల్ ఆర్ సినిమాను ఉదయం పదిన్నర గంటల నుంచి రాత్రి పదిన్నర వరకు మూడు షోల చొప్పున ప్రదర్శించనున్నారు.
ఇదీ చదవండి: Ugadi-2022: ఉగాది పర్వదినం.. షడ్రుచుల్లో దాగున్న ఆరోగ్యం