ETV Bharat / city

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 60మందికి ఇద్దరు గురువులు - amaravathi news

ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండవు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 60లోపు ఎంతమంది విద్యార్థులు ఉన్నా ఇద్దరు ఉపాధ్యాయులను నియమించనున్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం పోస్టుల కేటాయించనున్నారు. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు మార్గదర్శకాలు విడుదల చేశారు.

Two teachers will be hired in government primary schools
బడికి ఇద్దరు గురువులు
author img

By

Published : Jun 28, 2020, 8:07 AM IST

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 60లోపు ఎంతమంది విద్యార్థులు ఉన్నా ఇద్దరు ఉపాధ్యాయులను నియమించనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండవు. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్‌)కు పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. విద్యా హక్కు చట్టం ప్రకారం పిల్లలకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఉండేలా ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఫిబ్రవరి 29వరకు ఉన్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయనున్నారు. అనంతరం బదిలీలు చేపట్టనున్నారు.

సర్దుబాటు ఇలా చేస్తారు..

విద్యార్థులు తక్కువగా ఉండి ఉపాధ్యాయులు ఎక్కువగా ఉంటే అక్కడి పోస్టులను పిల్లలు అధికంగా ఉండే పాఠశాలకు బదిలీ చేస్తారు. 8 ఏళ్లు సర్వీసు పూర్తి చేసినవారికి బదిలీ తప్పనిసరి. ఆయా పాఠశాలల్లోని సీనియర్‌ ఉపాధ్యాయులు వద్దంటే జూనియర్‌కు అవకాశం కల్పిస్తారు. వీరికి అదనంగా పాయింట్లు కేటాయిస్తారు. 150 మంది విద్యార్థులు ఉంటేనే ఎల్‌ఎఫ్‌ఎల్‌ ప్రధానోపాధ్యాయుడి పోస్టు ఉంటుంది. ఇంతకంటే తక్కువ ఉంటే ఎస్జీటీగా పరిగణించి పోస్టును సర్దుబాటు చేస్తారు.

* ప్రాథమిక పాఠశాలల్లో గతంలో 20లోపు విద్యార్థులు ఉంటే ఒక ఉపాధ్యాయుడు ఉండగా.. ఇప్పుడు 60లోపు ఎంతమంది ఉన్నా ఇద్దరు ఉంటారు. రాష్ట్రంలో 7,774 ఏకోపాధ్యాయ పాఠశాలల్లో మరొకర్ని నియమించనున్నారు.

* గతంలో 61-80 విద్యార్థులకు ముగ్గురు ఎస్జీటీలు ఉంటే ఇప్పుడు 61-90కి ముగ్గురు ఉంటారు.

* 200 మంది విద్యార్థుల తర్వాత ప్రతి 40 మందికి అదనంగా ఎస్జీటీని నియమిస్తారు.

* ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6-7తరగతుల్లో 100మంది విద్యార్థులు ఉంటే నలుగురు సబ్జెక్టు ఉపాధ్యాయులు ఉంటారు.

* 6-8 తరగతుల్లో 140మంది ఉంటే ఆరుగుర్ని కేటాయిస్తారు.

* ఉన్నత పాఠశాలల్లో 240 మంది విద్యార్థులకు 9మంది ఉపాధ్యాయులను నియమిస్తారు.

* 1200-1240 కంటే ఎక్కువ పిల్లలు ఉంటే ప్రతి 40 మందికి ఒక స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టును మంజూరు చేస్తారు.

* 441-480మంది విద్యార్థులు ఉన్నచోట్ల క్రాఫ్ట్‌, డ్రాయింగ్‌, మ్యూజిక్‌ ఉపాధ్యాయుడిని కేటాయిస్తారు.

ప్రాథమిక స్థాయిలో ఉపాధ్యాయుల్ని పెంచాలి

‘‘ప్రాథమిక పాఠశాలల్లో 60 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయుల్ని కేటాయించారు. 1-6 తరగతుల వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని భావిస్తూ ఉపాధ్యాయుల సంఖ్య తగ్గించడం ఏమిటి..? ఒకేసారి రెండు భాషలు నేర్పించేందుకు ఉపాధ్యాయుల సంఖ్యను పెంచాలి. 20 మందికి ఒకర్ని నియమించాలి’’ - బాబురెడ్డి, ప్రధాన కార్యదర్శి, ఐక్య ఉపాధ్యాయ సంఘం

ఇవీ చదవండి:భారత యవనికపై చెరిగిపోని సంతకం 'పీవీ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.