కృష్ణా బేసన్లోని జలాశయాల్లో విద్యుదుత్పత్తి విషయంలో వివాదం ముదిరిన వేళ నాగార్జున సాగర్ వద్ద ఇరు రాష్ట్రాల అధికారులు సమావేశమయ్యారు. నాగార్జునసాగర్ జలాశయం వద్ద నిన్నటి నుంచి బలగాలను మోహరించగా.. తాజాగా ఇరు రాష్ట్రాల అధికారులు సాగర్ చేరుకున్న నీటిపారుదలశాఖ అధికారులు.. విజయపురిసౌత్ రివర్ వ్యూ అతిథిగృహంలో సమావేశమయ్యారు.
ఈ సమావేశానికి గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్ని, నల్గొండ రేంజ్ డీఐజీ ఎ.వి.రంగనాథ్ హాజరయ్యారు. పులిచింతలలో తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తిపై ఏపీ ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి:
AP-TS Water War: ఇటు పులిచింతల.. అటు సాగర్: జలజగడంతో భారీగా భద్రత పెంపు