ETV Bharat / city

ఈ నెల 22న కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం..! - ఏపీ ఇద్దరు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు

పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు ఎంపిక కావటంతో వారి మంత్రి పదవులకు రాజీనామా చేశారు. వీరద్దరి రాజీనామాతో ఖాళీ అయిన స్థానాల్లో ఇద్దరు ఎమ్మెల్యేలకు అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు స్థానాలకు ముమ్మిడవరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌, పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు, రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్‌ పేర్లు వినిపిస్తున్నాయి.

మంత్రి పదవులు ఎమ్మెల్యేలకే...ఎమ్మెల్సీలకు నోఛాన్స్!

author img

By

Published : Jul 12, 2020, 6:01 AM IST

మంత్రి పదవులకు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన రెండు స్థానాల్లో ఇద్దరు ఎమ్మెల్యేలకు అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీల్లో ఒకరికి అవకాశం ఉండొచ్చనే ప్రచారంలో వాస్తవం లేదని వైకాపా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఖాళీ అయిన స్థానాల్లో ఇద్దరు కొత్తవారికి చోటు మినహా ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చంటున్నారు. కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉందంటూ.. ముమ్మిడవరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌, పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు, రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్‌ పేర్లు వినిపిస్తున్నాయి.

ఈ నలుగురిలో ఇద్దరికి కేబినెట్‌లో బెర్తు ఖరారు కావచ్చని విశ్వసనీయ సమాచారం. ఈ నెల 22న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిసింది. చివరి నిమిషంలో ఏవైనా మార్పులుంటే 24న ఉంటుందంటున్నారు. పిల్లి సుభాస్‌ చంద్రబోస్‌ రాజీనామా చేసిన ఉపముఖ్యమంత్రి పదవి బీసీ వర్గానికి చెందిన మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది.

ఇదీ చదవండి : ప్రకాశంలో 27,000 నమూనాల వృథా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.