ESIC EQUIPMENT SUPPLYU BILLS PENDING IN AP: రాష్ట్రంలోని ఈఎస్‌ఐ ఆసుపత్రులకు వైద్య పరికరాలు సరఫరా చేసిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని... ట్విన్ సిటీస్ హాస్పటల్స్ సప్లయిర్స్ అసోసియేషన్ ఓ ప్రకటనలో పేర్కొంది. డిమ్స్ డైరక్టర్ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. సుమారు 200 కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉన్నట్లు వెల్లడించింది. ఏపీలో ఉన్న ఈఎస్‌ఐ ఆసుపత్రులకు వైద్య పరికరాల సరఫరాను నిలిపివేయాలని అసోసియేషన్ కోరింది. ఇటీవలే ఇండియన్ మెడికల్ డివైస్ ఇండస్ట్రీ రెడ్ నోటీస్ జారీ చేసిందని గుర్తు చేసింది.
ఇదీ చూడండి: Central Team Tour: వరద ప్రభావిత ప్రాంతాల్లో.. నేటి నుంచి కేంద్ర బృందం పర్యటన