ETV Bharat / city

శ్రావణి కేసు: దేవరాజ్​రెడ్డి పెళ్లి నిరాకరించినందుకే ఆత్మహత్య! - manasu mamatha serial actress sravani suicide case upddate

బుల్లి తెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే అదుపులోకి తీసుకున్న దేవ్‌రాజ్‌రెడ్డిని సుదీర్ఘంగా విచారిస్తుండగా... తాజాగా సాయికృష్ణారెడ్డి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఓ సినీ నిర్మాతను విచారణకు హాజరుకావాలంటూ తాఖీదులు జారీ చేశారు. విచారణలో శ్రావణి ఆత్మహత్యకు గల కారణాలపై నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఒకరిద్దరినీ అరెస్టు చేసే అవకాశం ఉంది.

tv-actor-sravani-suicide-case
tv-actor-sravani-suicide-case
author img

By

Published : Sep 14, 2020, 8:37 AM IST

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ ఎస్సార్‌నగర్ పోలీసులు కీలక సమాచారం రాబట్టారు. పెళ్లి చేసుకునేందుకు దేవరాజ్​రెడ్డి నిరాకరించడం వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురై శ్రావణి ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చారు. దేవరాజ్ రెడ్డి, సాయి కృష్ణారెడ్డి నుంచి మూడు రోజులుగా వివిధ కోణాల్లో సమాచారం సేకరిస్తున్న పోలీసులు ఆదివారం వారిద్దరినీ కలిపి విచారించారు. వారి మధ్య గొడవకు కారణమైన అంశాలపై తాజాగా ఇద్దరినీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. శ్రావణికి తొలుత సాయి కృష్ణారెడ్డితో పరిచయం ఏర్పడింది. అతని ద్వారా కొన్ని సినిమాల్లో చిన్న పాత్రలు లభించాయి. అనంతరం టీవీ సీరియల్స్​లో అవకాశాలు వచ్చాయి.

అయితే శ్రావణి.. ఏడాది క్రితం పరిచయమైన దేవరాజ్ రెడ్డితో చనువుగా ఉండటాన్ని సాయికృష్ణ జీర్ణించుకోలేకపోయాడు. ఆమె కుటుంబ సభ్యుల ద్వారా పెళ్లి ప్రతిపాదన తెచ్చాడు. దీనికి శ్రావణి అంగీకరించకపోవడం వల్ల వివాదం మొదలైంది. మరోవైపు దేవరాజ్​రెడ్డిని పెళ్లి చేసుకోవాలనుకున్న శ్రావణికి నిరాశే ఎదురైంది. ఇటీవల వరుసగా జరుగుతున్న గొడవలతో ఇద్దరి మధ్య మనస్పర్థలు పెరిగాయి. శ్రావణిని పెళ్లి చేసుకునేందుకు దేవరాజ్​రెడ్డి నిరాకరించాడు. ఇదే విషయాన్ని ఆమె మొబైల్ ఫోన్​కు సందేశం పంపారు.

ఈ విషయంలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన శ్రావణి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సాయికృష్ణ, దేవరాజు ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండుకు తరలించే అవకాశం ఉన్నట్లు సమాచారం. శ్రావణి తల్లిదండ్రుల నుంచి కూడా పోలీసులు వాంగ్మూలం సేకరించారు. 'ఆర్ఎక్స్ 100' సినిమా నిర్మాత అశోక్ రెడ్డిని విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. సోమవారం ఆయనను ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండిః శ్రావణి ఆత్మహత్య కేసులో విచారణకు హాజరైన సాయిరెడ్డి

కుటుంబసభ్యులే వేధిస్తున్నారని చెప్పింది: దేవరాజ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.