తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గ పార్టీ అధ్యక్షులు పి నారాయణ స్వామి మరణంపై పార్టీ నాయకత్వం సంతాపం తెలిపింది. ఈ ఘటన విచారకరమని అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ లో ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీకి ఆయన చేసిన సేవలు మరపురానివని గుర్తుచేసుకున్నారు. నారాయణస్వామి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులను ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాదం నుంచి త్వరగా కోలుకునే శక్తిని వారికి భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు.
ఇదీ చదవండి:
'వైకాపా కొల్లగొట్టిన నల్లధనం.. చెన్నై మీదుగా మారిషస్ చేరుతోంది'