TTD POLICE OVER ACTION రాజధాని అమరావతి మహిళలపై వెంకటపాలెం వద్ద ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో తితిదే భద్రతా సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. వచ్చేనెలలో జరగబోయే రెండో విడత పాదయాత్ర విజయవంతం కావాలంటూ అనంతవరం వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి వెంకటపాలెం తితిదే వేంకటేశ్వరస్వామి ఆలయం వరకు మహిళలు పాదయాత్ర చేపట్టారు. పాదయాత్ర ముగించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్న సమయంలో తితిదే భద్రతా సిబ్బంది ఒకరు వచ్చి మహిళల మెడలో ఆకుపచ్చ కండువాలు తీసేయాలంటూ ఒత్తిడి చేశారు. స్వయంగా వచ్చి ఓ మహిళ మెడలో ఉన్న ఆకపచ్చ కండువా లాగేశారు.
ఇవీ చదవండి: