దసరా పండుగ సందర్భంగా నడిపే బస్సులకు ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. గడిచిన ఐదు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1.30 కోట్ల మంది ప్రయాణికులను టీఎస్ఆర్టీసీ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేసిందన్నారు. ప్రయాణికుల సౌకర్యం, వారి భద్రతే ధ్యేయంగా ఆర్టీసీ సేవలు అందిస్తోందని వెల్లడించారు. మొదట పండుగ సందర్బంగా నడిపే ప్రత్యేక బస్సుల్లో 50 అధికంగా ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని విరమించుకున్నట్లు ఎండీ సజ్జనార్ తెలిపారు.
కరోనా సమయంలో ప్రజలపై అదనపు భారం మోపకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఆర్టీసీలో ప్రయాణిస్తూ ప్రయాణికులు చూపించే ఆదరాభిమానాలే సంస్థ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తాయని సజ్జనార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: