గత ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం...ఇవాళ అసెంబ్లీలో పూర్తి స్థాయి పద్దును ప్రవేశపెట్టింది. రూ.1,46,492.3 కోట్లతో పూర్తి స్థాయి బడ్జెట్ను ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ప్రవేశ పెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.1,11,055 కోట్లు, మూలధన వ్యయం రూ.17,274.67 కోట్లు, బడ్జెట్ అంచనాల్లో మిగులు రూ.2,044.08 కోట్లు, ఆర్థిక లోటు రూ.24,081.74 కోట్లు. ఆర్థిక మాంద్యం వల్ల ఆదాయం తగ్గినా... పరిస్థితుల్లో మార్పు వస్తుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పన చేసినట్లు కేసీఆర్ తెలిపారు.
ఐదేళ్లలో కేంద్రపథకాల ద్వారా రాష్ట్రానికి వచ్చిన నిధులు రూ.31,802 కోట్లు కాగా... రాష్ట్రం నుంచి పన్నుల ద్వారా కేంద్రానికి వెళ్లిన నిధులు రూ.2,72,926 కోట్లు.
బడ్జెట్ కేటాయింపులు...
రైతుబంధు | రూ.12 వేల కోట్లు |
రైతు రుణమాఫీ | రూ.6 వేల కోట్లు |
రైతుబీమా | రూ.1,137 కోట్లు |
విద్యుత్ రాయితీ | రూ.8 వేల కోట్లు |
ఆసరా పింఛన్లు | రూ.9,402 కోట్లు |
గ్రామపంచాయతీ | రూ.2,714 కోట్లు |
పురపాలక సంఘాలు | రూ.1,764 కోట్లు |