TS EAMCT 2022 Notification : తెలంగాణ ఎంసెట్, ఈసెట్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జూన్ 14 నుంచి 20 వరకు ఆన్ లైన్లో జరగనున్న ఎంసెట్ కోసం ఏప్రిల్ 6 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 6 నుంచి మే 28 వరకు ఆన్ లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. ఇంజినీరింగ్ లేదా అగ్రికల్చర్ విభాగాల కోసం ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 400 రూపాయలు, ఇతరులు 800 రూపాయలు.. రెండూ రాసే అభ్యర్థులు 1600 రూపాయలు చెల్లించాలి.
పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ గణితం చదివిన విద్యార్థులు బీటెక్, బీఫార్మసీ రెండో సంవత్సరంలో చేరేందుకు నిర్వహించే ఈసెట్ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. జులై 13న జరగనున్న ఈసెట్‌కు ఏప్రిల్ 6 నుంచి జూన్ 6 వరకు ఆన్ లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 400 రూపాయలు, ఇతరులు 800 రూపాయలు ఫీజు చెల్లించాలని కన్వీనర్ ప్రొఫెసర్ విజయ్ కుమార్ తెలిపారు. ఐసెట్, ఎడ్ సెట్, లాసెట్ షెడ్యూలు రేపు లేదా ఎల్లుండి ఖరారు చేసే అవకాశం ఉంది.
ఎంసెట్ జులై 14 నుంచి 5 రోజులపాటు జరగనుంది. జులై 14, 15 తేదీల్లో అగ్రికల్చర్, 18, 19, 20 తేదీల్లో ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు నిర్వహిస్తారు. ఎంసెట్‌ను రెండు రాష్ట్రాల్లో 105 కేంద్రాల్లో జరుపుతామని తెలిపారు. పాలిటెక్నిక్ విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్/బీఫార్మసీ రెండో ఏడాదిలో చేరేందుకు ఈసెట్‌ను జులై 13న జరపాలని నిర్ణయించామన్నారు. ఎంసెట్, ఈసెట్‌కు సంబంధించి తాజాగా నోటిఫికేషన్లు విడుదల చేశారు.
కనీసం 2.50 లక్షల దరఖాస్తులు?
ఎంసెట్‌కు రెండు రాష్ట్రాల నుంచి కనీసం రెండున్నర లక్షలమంది దరఖాస్తు చేయనున్నారు. అందులో 90 శాతం తెలంగాణ విద్యార్థులే ఉంటారు. గత ఏడాది ఎంసెట్ ఇంజినీరింగ్‌కు 1,64,962, అగ్రికల్చర్, ఫార్మసీలకు 86,644. దరఖాస్తులు అందాయి. ఈసారి కూడా ఇంటర్ మొదటి సంవత్సరంలో తప్పిన విద్యార్థులందరినీ కనీస మార్కులతో ప్రభుత్వం పాస్ చేసింది. ఈ క్రమంలో భారీ సంఖ్యలోనే పోటీ పడతారని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉండదు. అంటే ఎంసెట్ మార్కులతోనే ర్యాంకు కేటాయిస్తారు. 70 శాతం సిలబస్ ఆధారంగానే ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షలు జరిగాయి. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని ఎంసెట్ ప్రశ్నపత్రం రూపొందిస్తారు. ఈసెట్‌కు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 25 వేలమంది పోటీపడతారు.
ఇదీ చదవండి : ABV: 'వారిపై పరువు నష్టం దావా వేస్తా.. అనుమతివ్వండి'