ETV Bharat / city

తెలంగాణ: ఎంసెట్ -2021 నోటిఫికేషన్​ విడుదల - ఎంసెట్ 2021 పరీక్షల తేదీలు

తెలంగాణలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్​కు.. నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్​లైన్​లో పద్ధతిలో.. జూలై 5 నుంచి 9 వరకు జరగబోయే ఈ పరీక్షలకు ఈనెల 20 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు.

ts eamcet 2021 dates
తెలంగాణ: ఎంసెట్ 2021 నోటిఫికేషన్​ను విడుదల
author img

By

Published : Mar 18, 2021, 3:13 PM IST

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి.. ఎంసెట్ 2021 నోటిఫికేషన్​ను విడుదల చేసింది. ఈనెల 20 నుంచి మే 18 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు.. కన్వీనర్ గోవర్ధన్​ వెల్లడించారు. జూలై 5 నుంచి 9 వరకు జరగబోయే ఈ పరీక్షలను.. ఆన్​లైన్​లో నిర్వహించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

ఈ ఏడాది అపరాధ రుసుము లేకుండా 60 రోజులపాటు దరఖాస్తులకు అవకాశమిచ్చినట్లు కన్వీనర్​ తెలిపారు. ఆ తర్వాత.. ఆలస్య రుసుముతో జూన్ 28 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వివరించారు. కరోనా నేపథ్యంలో అపరాధ రుసుములను 50 శాతం తగ్గించామన్నారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్.. రెండింటికి కలిపి ఒకటిగా... లేదంటే వేర్వేరుగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు వివరించారు. పొరపాట్లు సరిదిద్దుకునేందుకు.. ఈ సారి కొన్ని వివరాలకు మాత్రమే ఎడిట్ ఆప్షన్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

విజయవాడ మేయర్‌గా రాయన భాగ్యలక్ష్మి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.