TRS MPs boycott from Parliament: తెరాస ఆందోళనపై కేంద్రం స్పందించడం లేదని, కేంద్రప్రభుత్వ తీరుకు నిరసనగా చట్టసభను బాయ్‌కాట్ చేస్తున్నామని తెరాస ఎంపీ కె.కేశవరావు స్పష్టం చేశారు. చట్టసభను బాయ్‌కాట్ చేయడం బాధ కలిగించే విషయమేనని.. సభను బాయ్‌కాట్ చేయాలని ఎవరూ కోరుకోరని అన్నారు. లోక్‌సభలో-9, రాజ్యసభలో-7 మంది బాయ్‌కాట్ చేస్తున్నట్లు తెలిపారు.
TRS MPs boycott from Lok Sabha : కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉందని కేశవరావు ఉద్ఘాటించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎఫ్‌సీఐ నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. తెలంగాణ నుంచి బాయిల్డ్‌రైస్ కొనబోమని చెబుతున్నారన్న కేకే.. రబీలో పూర్తిగా ఉప్పుడు బియ్యం మాత్రమే వస్తుందని తెలిపారు. వాతావరణ పరిస్థితుల వల్ల రబీలో రా రైస్ రాదని స్పష్టం చేశారు. రబీ ధాన్యం విరిగిపోయి నూకగా మారుతుందని.. ఆ ధాన్యాన్ని బాయిల్డ్ రైస్‌గా మారుస్తామని చెప్పారు.
TRS MPs boycott from Rajya Sabha : పార్లమెంట్ లోపలా, బయటా నిరసన తెలిపామని ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు. ఎన్నిరోజులుగా అడుగుతున్నా.. బాయిల్డ్ రైస్ కొంటారో లేదో చెప్పడం లేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం డొంక తిరుగుడు సమాధానాలు చెబుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతుల బాధను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
"పార్లమెంట్ సాక్షిగా రాజకీయాలు చేస్తున్నారు. భాజపా నేతలు మోసపూరిత మాటలు మాట్లాడుతున్నారు. యాసంగి పంటను కొనుగోలు చేస్తారో లేదో చెప్పడం లేదు. తెలంగాణ రైతుల కోసమే వాకౌట్ చేస్తున్నాం. రైతులకు న్యాయం జరగట్లేదనే బాయ్‌కాట్ చేస్తున్నాం. కొంతమంది చిల్లరగా మాట్లాడుతున్నారు. అన్ని విధాలుగా మా నిరసనను తెలిపాం. ఏడు రోజులుగా ఆందోళన చేస్తున్నా కేంద్రం పట్టించుకోలేదు. మేం ఒకటి అడిగితే కేంద్రం మరొకటి చెబుతోంది. కేంద్రం తీరుకు నిరసనగానే ఉభయ సభలను బాయ్‌కాట్ చేస్తున్నాం. తెలంగాణ రైతులను రోడ్డుపైకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది కేంద్రం. ఆ తీరును ముందుగానే సీఎం కేసీఆర్ గ్రహించారు. కేంద్రం తీరును ప్రజాక్షేత్రంలోనే ఎండగడతాం."
- నామ నాగేశ్వరరావు, తెరాస లోక్‌సభాపక్ష నేత
TRS MPs Protest in Parliament : ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం తన స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని వారం రోజులుగా ఉభయ సభల్లో తెరాస ఎంపీలు నిరసన తెలుపుతున్నారు. ఎంతకీ కేంద్రం పట్టించుకోవడం లేదని చివరకు ఇవాళ చట్టసభను బాయ్‌కాట్ చేశారు.
TRS MPs protest over Paddy Procurement : మరోవైపు ఇటీవల రాజ్యసభలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ ఎంపీలు ధాన్యం కొనుగోలు విషయాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారమే కొనుగోలు చేస్తామని చేశారు. బాయిల్డ్ రైస్ ఎంత కొంటారో కేంద్రం స్పష్టం చేయాలన్న తెరాస ఎంపీల ప్రశ్నకు సమాధానమిచ్చారు. వినియోగించే ధాన్యాన్నే కొనుగోలు చేస్తామన్న పీయూష్ గోయల్.. ఈ మేరకు సీఎం కేసీఆర్‌తో కూడా మాట్లాడానని తెలిపారు. వానాకాలం పంట పూర్తిగా కొంటామని చెప్పారు. దేశంలో ప్రతి ఏటా ధాన్యం సేకరణను పెంచుతున్నామన్న కేంద్రమంత్రి.. తెలంగాణ నుంచి ధాన్యం సేకరణను బాగా పెంచామని చెప్పారు.
ఇవీచదవండి.