ETV Bharat / city

BRS: బీఆర్​ఎస్ ఆవిర్భావంతో సంబరాల్లో గులాబీ తమ్ముళ్లు

author img

By

Published : Oct 6, 2022, 12:20 PM IST

TRS Celebrations: తెలంగాణ రాష్ట్ర సమితిని.. భారత్‌ రాష్ట్ర సమితిగా పార్టీ అధినేత కేసీఆర్‌... పేరు మార్చడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు సంబురాలు మునిగితేలాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా.. కార్యకర్తలు, అభిమానులు రహదారులపైకి వచ్చి వేడుకలు చేసుకున్నారు. బాణసంచా కాల్చుతూ.. ఆనందోత్సాహాల్లో మునిగి తేలారు.

Formation of BRS
బీఆర్​ఎస్ ఆవిర్భావంతో సంబరాలు
బీఆర్​ఎస్ ఆవిర్భావంతో సంబరాల్లో గులాబీ తమ్ముళ్లు

Formation of BRS: తెరాస.. భారత్‌ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించడంతో... గులాబీ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో తెరాస శ్రేణులు టపాసులు పేల్చి స్వీట్లు పంచుకున్నారు. ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగురామన్న క్యాంపు కార్యాలయంలో... బాణసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. సిద్దిపేటలో భారాస శ్రేణులు సంబురాల్లో మునిగితేలారు.

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో దేశ్ కి నేత కేసీఆర్ అంటూ.. గులాబీ శ్రేణుల నినాదాలతో హోరెత్తింది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా తెరాస కార్యకర్తలు.. మిఠాయిలు పంచుకుని.. నృత్యాలతో సందడి చేశారు. నిజామాబాద్ జిల్లాలో తెరాస శ్రేణులు సంబరాల్లో మునిగిపోయింది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా క్యాంపు కార్యాలయంలో... భారీ కేసీఆర్ చిత్ర పటాన్ని చిత్రీకరించారు. హైదరాబాద్‌కు చెందిన కళాకారుడు 10 గంటల పాటు శ్రమించి చిత్ర పటాన్ని సిద్ధం చేశారు.

కరీంనగర్‌లో గులాబీ శ్రేణుల సంబరాలు మిన్నంటాయి. తెలంగాణ చౌక్ వద్ద మేయర్ సునీల్‌రావు ఆధ్వర్యంలో... భారీగా చేరుకున్న కార్యకర్తలు, దేశ్‌కీనేతా కేసీఆర్‌ అంటూ పెద్దెత్తున నినాదాలు చేస్తూ నృత్యాలు చేశారు. జగిత్యాల కొత్త బస్టాండ్ కూడలి వద్ద బాణాసంచా కాల్చి... మిఠాయిలు పంచుకున్నారు.

మహబూబాబాద్‌, ములుగులో తెరాస శ్రేణులు సంబురాల్లో మునిగితేలారు. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఖమ్మం జిల్లా మధిరలో తెరాస శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజు నాయకత్వంలో.. భారీ ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌, నేరేడుచర్ల , పాలకీడు మండలాల్లో.. గులాబీ శ్రేణుల సంబరాల్లో మునిగితేలారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.