ETV Bharat / city

'రోడ్ల అభివృద్ధి టెండర్లలో అనుమనాస్పద లావాదేవీలు లేవు'

ఏపీ-తెలంగాణ మధ్య బస్సుల పునరుద్ధరణ, గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలకు బస్సు సర్వీసులు, రోడ్ల నిర్మాణ టెండర్లపై రవాణాశాఖ, రోడ్లు, భవనాలశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు అమరావతిలో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం బస్సు సర్వీసులు పెంచడానికి ఇష్టపడట్లేదని కృష్ణబాబు స్పష్టం చేశారు. ఏపీ తిప్పే సర్వీసుల కన్నా డబుల్ సర్వీసులు తిప్పుతామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోందన్నారు.

కృష్ణబాబు
కృష్ణబాబు
author img

By

Published : Sep 18, 2020, 8:26 PM IST

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల పరీక్షలతోపాటు, ఇతర పోటీ పరీక్షలకు ఆర్టీసీ బస్సులు నడపాలని నిర్ణయించామని రవాణాశాఖ, రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. విజయవాడ, విశాఖలో సిటీ బస్సులు తిరగనున్నాయని ప్రకటించారు. కొవిడ్ నిబంధనలు పాటించి సిటీ బస్సులను తిప్పుతామన్నారు. 50 శాతం ఆక్యుపెన్సీతో సిటీ బస్సులు నడపడం వల్ల భారీగా నష్టం వస్తుందని కృష్ణబాబు అన్నారు. బస్సుల్లో స్టాండింగ్‌కు అనుమతించడం లేదన్నారు. వృద్ధులు బస్సు ప్రయాణాలు చేయొద్దని సూచిస్తున్నామన్న ఆయన... అత్యవసర పరిస్థితులంటూ కొందరు వృద్ధులు ప్రయాణిస్తున్నారని తెలిపారు.

అప్పుడే కనకదుర్గ పైవంతనపై రాకపోకలు

బస్సుల్లో సీనియర్ సిటిజన్లకు రాయితీలు తాత్కాలికంగా రద్దు చేశామని కృష్ణబాబు వెల్లడించారు. సాధారణ పరిస్థితులు రాగానే సీనియర్ సిటిజన్లకు రాయితీ వర్తింపజేస్తామన్నారు. కేంద్రమంత్రి గడ్కరీకి కరోనా వల్ల విజయవాడ కనకదుర్గ వారధి ప్రారంభోత్సవం వాయిదా పడిందని తెలిపారు. కేంద్రమంత్రి ప్రారంభించాకే పైవంతెనపై రాకపోకలకు అనుమతి ఇస్తామని ప్రకటించారు.

ఆ రూట్ల గురించి తెలంగాణ మాట్లాడడం లేదు

"తెలంగాణ ప్రభుత్వం బస్సు సర్వీసులు పెంచడానికి ఇష్టపడట్లేదు. బస్సు సర్వీసులు తగ్గించుకోవాలని ఏపీకి సూచిస్తోంది. తెలంగాణ సూచనల మేరకు సర్వీసులు తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఏపీ తగ్గించుకునే 1.10 లక్షల కిలోమీటర్ల మేర రవాణాను ప్రైవేట్ ఆపరేటర్లకు అవకాశం లభిస్తుంది. ఏపీ తిప్పే సర్వీసుల కన్నా డబుల్ సర్వీసులు తిప్పుతామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. బెజవాడ-హైదరాబాద్ రూట్​లలో మాత్రమే డబుల్ సర్వీసులు తిప్పుతామని చెబుతున్న తెలంగాణ.. మిగిలిన రూట్ల గురించి ప్రస్తావించడం లేదు. ఏపీ 72 రూట్లల్లో బస్సులు తిప్పుతుంటే.. తెలంగాణ 27 రూట్లల్లో మాత్రమే బస్సులు నడుపుతోంది"--కృష్ణబాబు, రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి

బిడ్డు ఎందుకు తగ్గాయో పరిశీలిస్తాం

ఎన్డీబీ ద్వారా రాష్ట్రంలో రోడ్ల నిర్మాణ పనులు చేపడతామని కృష్ణబాబు తెలిపారు. వివిధ రహదారుల అభివృద్ధికి చర్యలు ప్రారభించామన్న ఆయన... టెండర్లలో పారదర్శకత కోసం జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపుతామన్నారు. పనులు మొదలుపెట్టకపోతే నిధులు సరెండర్ చేయాలని కేంద్రం చెప్పిందన్న కృష్ణబాబు... ఎన్‌ఐసీ వేదికగా గ్లోబల్ బిడ్డింగ్ ద్వారా టెండర్లపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ-టెండర్‌తో పాటు 25 బిడ్లు వస్తే అందరూ హార్డ్ కాపీలు పంపారని తెలిపారు. బిడ్డింగ్ దశలో కూడా ఎన్డీబీ అభిప్రాయం తీసుకున్నామని స్పష్టం చేశారు. ప్రపంచ బ్యాంకు సూచన మేరకే అర్హత ప్రమాణాలు నిర్దేశించామని పేర్కొన్నారు. జాతీయ బ్యాంకుల ద్వారానే సంస్థలు లావాదేవీలు చేయాలని నిబంధన ఉందన్నారు. టెండర్ల విషయంలో సందేహాస్పద లావాదేవీలు జరగలేదన్నారు. బిడ్ల నుంచి రివర్స్ టెండర్ల వరకు ప్రభుత్వం, ఎన్డీబీ పర్యవేక్షణలో సాగిందన్నారు. బిడ్లు ఎందుకు తక్కువ దాఖలు అయ్యాయనే విషయం పరిశీలిస్తున్నామని కృష్ణబాబు అన్నారు.

ఇదీ చదవండి : 16 నెలల వైకాపా అవినీతి పాలనపై సీబీఐ విచారణ జరపాలి: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.