ETV Bharat / city

AUGUST15: పంద్రాగస్టు నేపథ్యంలో హైదరాబాద్​లో ట్రాఫిక్​ ఆంక్షలు.. ఆ మార్గాల్లో నో ఎంట్రీ!

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా హైదరాబాద్ గోల్కొండ కోటకు వచ్చిపోయే దారులపై ట్రాఫిక్​ ఆంక్షలు విధించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆ మార్గాల్లో వాహనాలను దారి మళ్లించనున్నారు.

HYD TRAFFIC UPDATES
హైదరాబాద్​లో ట్రాఫిక్​ ఆంక్షలు
author img

By

Published : Aug 13, 2021, 6:33 PM IST

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గోల్కొండ కోటపై సీఎం కేసీఆర్.. జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. ఈ తరుణంలో గోల్కొండ కోటకు వచ్చిపోయే దారులపై ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. 15వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆ మార్గాల్లో వాహనాలను దారి మళ్లించనున్నారు. రామ్​దేవ్​ గూడ నుంచి గోల్కొండ కోటకు చేరుకునే రహదారిపై సాధారణ వాహనాల రాకపోకలను నియంత్రించారు. ఈ దారిలో కేవలం స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనే ముఖ్యుల వాహనాలకు మాత్రమే అనుమతి ఉంది.

సికింద్రాబాద్, బంజారాహిల్స్, మాసబ్ ట్యాంక్, మెహదీపట్నం నుంచి వచ్చే వీఐపీ వాహనాలను కోట ప్రధాన ద్వారం పక్కన రహదారిపై, బస్టాండ్ వద్ద, బాయ్స్ గ్రౌండ్స్ వద్ద నిలిపేలా ఏర్పాట్లు చేశారు. షేక్​పేట్ నాలా, టోలీచౌకీ, సెవెన్ టూంబ్స్ రహదారి మీదుగా వచ్చే వాళ్లు ప్రియదర్శిని పాఠశాలలో వాహనాలు నిలపాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. సాధారణ ప్రజలకు గోల్కొండ హుడా పార్కు, సెవెన్ టూంబ్స్ వద్ద వాహనాలు నిలిపేలా ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల్లో గోల్కొండ కోటలోకి తీసుకెళ్లనున్నారు. వీపీపీ పాసులను ప్రతి వాహనదారుడు వాహనాలపై కనిపించేలా ఉంచి సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

Fake Challanas: 'ఆరుగురు సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేశాం.. సొమ్మును రికవరీ చేస్తున్నాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.