తమకు ఏనాడూ 50 శాతం నీళ్లు కావాలని తెలంగామ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరలేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. తమకు 34 శాతం నీళ్లు కావాలని చెప్పిందే కేసీఆర్ అని.. 34 శాతం కృష్ణా నీళ్లు చాలని మంత్రిగా హరీశ్ సంతకం పెట్టారని రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణలో గత 7 ఏళ్లలో కేవలం 299 టీఎంసీలు వాడుకున్నామని అన్నారు.
రాయలసీమ ఎత్తిపోతలకు 203 జీవో ఇచ్చినప్పుడు కేసీఆర్ మాట్లాడలేదని రేవంత్ తెలిపారు. ఆ ప్రాజెక్టుకు ఏపీ సీఎం జగన్ నిధులిచ్చినప్పుడు కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. రాయలసీమ ఎత్తిపోతలపై పాలమూరు రైతు... ఎన్జీటీని నుంచి స్టే తెచ్చారని గుర్తు చేశారు.
మోదీ సర్కారును అన్ని విషయాల్లో కేసీఆర్ సమర్థించారని రేవంత్‌రెడ్డి అన్నారు. జులై 9న బోర్డు సమావేశానికి రమ్మంటే.. జులై 20న బోర్డు భేటీ ఏర్పాటు చేయాలని సీఎం అంటున్నారని విమర్శించారు. కృష్ణా జలాలను కాపాడటం కంటే కేసీఆర్కు పెద్ద పనులు ఏమున్నాయని రేవంత్‌రెడ్డి నిలదీశారు.
ఇదీ చూడండి: