ముఖ్యమంత్రి కేసీఆర్.. భాజపాకు, ప్రధాని మోదీకి ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ మైనార్టీలకు వ్యతిరేకమైన అనేక అంశాల్లో భాజపాకు మద్దతు ఇచ్చారని అన్నారు. జూబ్లీహిల్స్‌లోని మాజీ మంత్రి షబ్బీర్ అలీ నివాసంలో కాంగ్రెస్ మైనార్టీ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ట్రిపుల్ తలాక్ బిల్లులో తెరాస ఎంపీలు భాజపా ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంతో పాటు పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరసత్వ రిజిస్టర్‌లను తెరాస వ్యతిరేకించలేదని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ పదే పదే డిమాండ్ చేస్తున్నప్పటికీ తెరాస ప్రభుత్వం.. సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెరాసను భాజపా-బి టీమ్‌గా అభివర్ణించడం వాస్తవమేనన్నారు. విద్య, ఉద్యోగ రంగాల్లో ముస్లిం సోదరులకు 12 శాతం రిజర్వేషన్‌లు ఇస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్.. ఇప్పటివరకు అమలు చేయలేదని రేవంత్ విమర్శించారు. ఈ సందర్భంగా 4 శాతం రిజర్వేషన్ల కోసం ముస్లింలకు బీసీ-ఈ కోటాను అమలు చేయడంలో షబ్బీర్ అలీ పోషించిన పాత్రను ఆయన ప్రశంసించారు.
ఇదీ చూడండి:
Kishan Reddy: కృష్ణా జలాలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు