- CORONA: రాష్ట్రంలో కొత్తగా 1,125 కరోనా కేసులు.. 9 మరణాలు
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 49,568 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,125 కరోనా కేసులు, 9 మరణాలు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- GVL: ఉత్తరాంధ్ర దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైంది: ఎంపీ జీవీఎల్
ఉత్తరాంధ్ర అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఎంపీ జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంతం దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైందని.. వెనుకబాటుపై ప్రతి ఒక్కరూ నేతలను నిలదీయాలన్నారు. కేవలం కేంద్రం నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించాలి: కళా వెంకట్రావు
విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీలు పెరగటానికి ప్రభుత్వ అసమర్థ పాలన, అనాలోచిత నిర్ణయాలే కారణమని ఆరోపించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- వినాయక నిమజ్జనంలో అలజడి... అసలేం జరిగింది..!
గుంటూరు జిల్లా మాచర్ల మండలం కొత్తపల్లి గ్రామంలో నిర్వహించిన వినాయక నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. నిమజ్జనంలో కొందరు చేసిన శబ్దాలకు బెదిరిపోయిన ఎద్దులు.. భక్తులపైకి దూసుకెళ్లాయి. ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- మరో సీఎం మార్పు.. భాజపా కసరత్తు!
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ దిల్లీ పర్యటనలో ఉన్నారు. మంగళవారం సాయంత్రం భాజపా సీనియర్ నేతలతో ఆయన భేటీకానున్నారు(jai ram thakur news). అయితే ఠాకూర్‌ను సీఎం పదవి నుంచి తప్పించే యోచనలో పార్టీ ఉన్నట్టు ఊహాగానాలు జోరందుకున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం- 12 ఏళ్ల బాలుడిపై కేసు
మహారాష్ట్రలోని పాల్గఢ్ జిల్లాలో ఓ ఐదేళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. మరోవైపు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలోనూ అత్యాచార ఘటనలు వెలుగు చూశాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ఆ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు- ఒక్కరోజే 12 కేసులు వచ్చాయని...
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 8 నగరాల్లో అమల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూను ఈ నెల 25వరకు పొడిగించింది(gujarat covid guidelines). పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- స్వీయ నిర్బంధంలోకి రష్యా అధ్యక్షుడు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లారు. ఈ మేరకు క్రెమ్లిన్(రష్యా ప్రభుత్వ అధికారిక భవనం) స్పష్టం చేసింది. కొవిడ్ పరీక్షలో పుతిన్‌కు నెగెటివ్ వచ్చినట్లు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ICC ODI Rankings: మరోసారి అగ్రస్థానంలో మిథాలీ, షెఫాలీ
అంతర్జాతీయ క్రికెట్ మండలి మంగళవారం విడుదల చేసిన మహిళల వన్డే క్రికెట్ ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్లు సత్తా చాటారు. వన్డేల్లో కెప్టెన్ మిథాలీ రాజ్(Mithali Raj Ranking), టీ20ల్లో షెఫాలీ వర్మ(Shafali Verma Ranking) అగ్రస్థానంలో నిలిచారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- PelliSandaD Teaser: 'పెళ్లిసందD' మామూలుగా లేదు!
యువ కథానాయకుడు రోషన్, శ్రీలీల జంటగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వం పర్యవేక్షణలో రూపొందిన చిత్రం 'పెళ్లిసందD'. గౌరీ రోణంకి దర్శకత్వం వహించిన ఈ చిత్ర టీజర్‌ను(PelliSandaD Teaser) 'కింగ్' నాగార్జున విడుదల చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి