- పేదవాడికి ఉపయోగపడని ప్రభుత్వాలు.. ఫెయిల్ అయినట్లే: సీఎం
చిరు వ్యాపారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం జగన్ ఉద్ఘాటించారు. అధిక వడ్డీలు చెల్లిస్తూ కష్టాలు పడే వారికి 10 వేల రూపాయల రుణం అందిస్తున్నామని.. దీన్ని చిరువ్యాపారులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'సీఎం గారూ.. ఔషధాన్ని ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకు సహకరించండి'
ముఖ్యమంత్రి జగన్‌కు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య లేఖ రాశారు. కరోనా నివారణ దిశగా తాను రూపొందిస్తున్న ఔషధాన్ని ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- Ap Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 7,796 కరోనా కేసులు, 77 మరణాలు
రాష్ట్రంలో కొత్తగా 7,796 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తాజా బులిటెన్‌లో తెలిపింది. గడిచిన 24 గంటల్లో 89,732 శాంపిల్స్ పరీక్షించగా, 7,796 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయింది. తాజాగా 14,641మంది కరోనా నుంచి కోలుకుని బయటపడ్డారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- Love cheating: ప్రేమన్నారు..మోసగించారు..ఒక్కరు కాదు..!
ప్రేమించానని యువకుడు ఓ యువతి వెంట పడ్డాడు... పెళ్లి చేసుకుంటానని ఎన్నో మాయమాటలు చెప్పాడు. ఎంతో కాలం అవకాశం కోసం ఎదురుచూసి.. నగ్న ఫొటోలు సేకరించాడు.. ఆ తరువాత అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేస్తూ.. గొడవకు దిగేవాడు... ఉద్యోగం చేస్తున్నా అక్కడకు వెళ్లి ఘర్షణ పడేవాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ఐరాస ఆర్థిక, సామాజిక మండలిలో భారత్
ఐరాస ఆర్థిక, సామాజిక మండలిలో భారత్‌కు చోటు లభించింది. సోమవారం జరిగిన ఎన్నికల్లో 2022-24 కాలానికి సభ్య దేశంగా భారత్ ఎన్నికైంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'అనాథల అక్రమ దత్తతలపై చర్యలు తీసుకోండి'
కరోనా కాలంలో అనాథ పిల్లల పేరుతో అక్రమాలకు పాల్పడుతోన్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. అనాథ పిల్లలకు సకాలంలో అన్ని సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ఐదో తరగతి విద్యార్థి లేఖకు సీజేఐ ఫిదా
దేశంలో కరోనా పరిస్థితులపై సుప్రీంకోర్టు తీసుకున్న చొరవను ప్రశంసిస్తూ.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాసింది కేరళకు చెందిన ఐదో తరగతి విద్యార్థిని లిద్వినా జోసెఫ్. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ రమణకు శుభాకాంక్షలు తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- దేశాధ్యక్షుడికి చెంపదెబ్బ- ఇద్దరు అరెస్టు
ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మేక్రాన్ చెంప చెళ్లుమనిపించి షాక్ ఇచ్చాడు ఓ వ్యక్తి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్‌గా మారింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- పొలాండ్ ఓపెన్‌కు భారత రెజ్లర్ దూరం
పొలాండ్ వేదికగా జరగనున్న రెజ్లింగ్ పోటీల నుంచి భారత రెజ్లర్ దీపక్ పూనియా వైదొలిగాడు. ఎడమ చేతికి గాయం కారణంగా పోటీలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'పవన్-హరీశ్ శంకర్ చిత్రంపై నిర్మాణ సంస్థ క్లారిటీ'
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందబోతుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్‌లుక్‌పై ఓ అప్డేట్ ఇచ్చింది నిర్మాణ సంస్థ. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి