ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7 PM - ap top ten news

.

Topnews
Topnews
author img

By

Published : May 24, 2021, 7:01 PM IST

  • 'కొవాగ్జిన్​కు త్వరలోనే డబ్ల్యూహెచ్​ఓ అనుమతులు!'

కొవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతుల కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతులు త్వరలోనే వస్తాయని విశ్వసిస్తున్నట్లు భారత్​ బయోటెక్​ వర్గాలు వెల్లడించాయి. ఇందుకు అవసరమైన ప్రక్రియ దాదాపు పూర్తయిందని తెలిపాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • ఆనందయ్య మందులపై హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్

ఆనందయ్య ఆయుర్వేదిక్ మందుల పంపిణిపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. మందు తీసుకుని అనేకమంది కోలుకున్నారని పిటిషన్​లో తెలిపారు. ఈ హౌస్ మోషన్ పిటిషన్​పై హైకోర్టు నుంచి ఇంకా అనుమతి రాలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • బ్లాక్ ఫంగస్​ వ్యాధిగ్రస్తులకు సకాలంలో వైద్యం అందించండి: మంత్రి ఆళ్ల నాని

బ్లాక్ ఫంగస్ వ్యాధిగ్రస్తులకు సకాలంలో వైద్యం అందించడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఆళ్ల నాని అధికారులను ఆదేశించారు. బ్లాక్ ఫంగస్ సోకిన బాధితులకు అన్ని ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సదుపాయం కల్పించాలన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • నీటిపారుదలశాఖ ఇంజినీర్‌పై బుగ్గవంక నిర్వాసితుల దాడి

కడప జిల్లాలో నీటిపారుదలశాఖ ఇంజినీర్‌పై బుగ్గవంక నిర్వాసితుల దాడి చేశారు. జేసీబీతో తమ ఇళ్లు కూల్చివేస్తున్నారని నిర్వాసితులు ఆగ్రహం చేస్తూ.. ఇంజినీర్‌ రఘునాథరెడ్డిపై రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • రాష్ట్రంలో కొత్తగా 12,994 కరోనా కేసులు, 96 మరణాలు

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొంతమేర తగ్గింది. గడిచిన 24 గంటల్లో 58,835 నమూనాలను పరీక్షించగా.. 12,994 మందికి పాజిటివ్‌ నిర్ధరణ అయ్యింది. తాజా కేసులతో కలిసి ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 15,93,821కి చేరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 'ఫంగస్​లలో భిన్నమైన రంగులు అందుకే'

దేశంలో బ్లాక్​, వైట్​ ఫంగస్​లు సహా కొత్తగా ఎల్లో ఫంగస్​ వెలుగు చూసిన క్రమంలో రంగుల్లో తేడాలపై క్లారిటీ ఇచ్చింది దిల్లీ ఎయిమ్స్​. వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి చెందితే ఫంగస్​ల రంగు భిన్నంగా కనిపిస్తుందని పేర్కొంది. దేశంలో కొత్త కేసులు తగ్గుముఖం పట్టాయని తెలిపారు డాక్టర్​ రణ్​దీప్​ గులేరియా. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • కోర్టులో ప్రత్యక్షంగా హాజరైన సూకీ

మయన్మార్​ బహిష్కృత నేత ఆంగ్​సాన్ సూకీ కోర్టు ముందు సోమవారం ప్రత్యక్షంగా హాజరయ్యారు. నెపిడా నగరంలోని సెంట్రల్​ కౌన్సిల్​ హాల్​లో ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానానికి రావడానికి ముందు ఆమె తన వ్యక్తిగత న్యాయవాదుల బృందాన్ని కలుసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • ఎఫ్​డీఐలు 19శాతం జంప్- గుజరాత్​ టాప్​

కరోనా సంక్షోభం ఉన్నా 2020-21లో భారత్​కు విదేశీ ప్రత్యక్ష పెట్టుబుడులు వెల్లువెత్తాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. 2019-20తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరం ఎఫ్​డీఐలు 19శాతం పెరిగినట్లు వెల్లడైంది. అత్యధిక ఎఫ్​డీఐలు సాధించిన రాష్ట్రాల్లో గుజరాత్ అగ్ర స్థానంలో నిలిచింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • సచిన్ బ్యాట్​తో పాక్ క్రికెటర్ ఫాస్టెస్ట్ సెంచరీ

1996లో పాక్ జట్టులోకి షాహీద్ అఫ్రిది అరంగేట్రం చేసినప్పుడు అతడి దగ్గర సరైన బ్యాట్​ కూడా లేదు. దీంతో అప్పటి కెప్టెన్ వకార్ యూనిస్.. కెన్యాతో మ్యాచ్​ సందర్భంగా తన దగ్గరున్న సచిన్ బ్యాట్​ను అతడికి ఇచ్చాడు. ఆ తర్వాత ఆ మ్యాచ్​లో రెచ్చిపోయిన యువ అఫ్రిది.. ఏకంగా 37 బంతుల్లో సెంచరీ చేసి, అప్పట్లో వన్డేల్లో వేగవంతమైన సెంచరీ రికార్డు సృష్టించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • సల్మాన్​ చిత్రంలో ఉగ్రవాదిగా ఇమ్రాన్​!

బాలీవుడ్​ హీరో సల్మాన్​ ఖాన్ ప్రధానపాత్రలో యశ్​రాజ్​ ఫిల్మ్స్​ నిర్మిస్తున్న చిత్రం 'టైగర్​ 3'. కరోనా కారణంగా చిత్రీకరణ ఆగిపోయింది. ఇందులో సల్మాన్​కు జోడీగా కత్రినా కైఫ్​ నటిస్తోంది. వీరితో మరో నటుడు ఇమ్రాన్​ హష్మీ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.