- కరోనా కలవరం... ఒక్కరోజే వెయ్యి దాటిన కొవిడ్ కేసులు
రాష్ట్రంలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,005 కరోనా కేసులు, రెండు మరణాలు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- బద్వేల్ ఎమ్మెల్యే పార్థివదేహానికి సీఎం జగన్ నివాళి
కడప జిల్లా బద్వేల్ ఎమ్మెల్యే డా. వెంకట సుబ్బయ్య పార్థివదేహానికి సీఎం జగన్ నివాళులర్పించారు. అనంతరం వెంకటసుబ్బయ్య కుటుంబసభ్యులను పరామర్శించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'రైతులపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా'
తాను రైతు బిడ్డను కావటంతోనే తొందరపాటులో అలా మాట్లాడాల్సి వచ్చిందని మంత్రి రంగనాథరాజు తెలిపారు. రైతులు ఎవరైనా తన వ్యాఖ్యలపై ఇబ్బందిపడితే క్షమించాలని కోరారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- విశాఖ-కర్నూలు మధ్య ఇండిగో విమాన సర్వీసు ప్రారంభం
విశాఖ-కర్నూలు మధ్య ఇండిగో విమాన సర్వీసును మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రారంభించారు. విశాఖ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసును ప్రారంభించిన అవంతి... రాయలసీమకు, ఉత్తరాంధ్రకు మధ్య అనుసంధానత మరింత పెరిగిందని చెప్పారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- భారత్‌కు మరో 10 రఫేల్ యుద్ధ విమానాలు
వచ్చే నెల రోజుల్లో భారత సైన్యం అమ్ముల పొదిలో మరో 10 రఫేల్ యుద్ధ విమానాలు చేరనున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రెండు, మూడు రోజుల్లో భారత్‌కు 3 రఫేల్ విమానాలు వస్తాయని పేర్కొన్నాయి. ప్రస్తుతం 11 రఫేల్ యుద్ధ విమానాలు అంబాలాలోని 17వ స్క్వాడ్రన్‌లో సేవలు అందిస్తున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- కుంభమేళా భక్తులకు సురక్షిత సేవలపై ప్రతిజ్ఞ
హరిద్వార్‌లో వచ్చేనెల నుంచి ప్రారంభమయ్యే కుంభమేళాకు హాజరయ్యే భక్తులకు అసౌకర్యం కలగకుండా సేవలందిస్తామని ఉత్తరాఖండ్ పోలీసులు, ఇతర కేంద్ర బలగాలు ప్రతిజ్ఞ చేశాయి. భక్తులంతా సురక్షితంగా ఉండేలా పనిచేయనున్నట్లు ప్రకటించాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- మన్‌సుఖ్ హిరేన్ మృతి కేసులో కీలక మలుపు
ముకేశ్ అంబానీ ఇంటి పరిసరాల్లో పేలుడు పదార్థాల కారు యజమానిగా అనుమానిస్తున్న మన్‌సుఖ్ హిరేన్ మృతి కేసు కీలక మలుపు తిరిగింది. మృతదేహం దొరికిన మితి నదిలో గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు.. కంప్యూటర్ సీపీయూ, వాహనం నంబర్ ప్లేట్ వంటి కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- బల్క్ ఎస్ఎంఎస్ నిబంధనల అమలుపై ట్రాయ్ లేఖ
బల్క్ ఎస్ఎంఎస్లకు సంబంధించి ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్న కొత్త నిబంధనల అమలుకు సహకరించాలని.. టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) వివిధ మంత్రిత్వ శాఖలు, పరిశ్రమ సంఘాలకు లేఖ రాసింది. ఈ విషయంలో ట్రాయ్‌కు పూర్తిగా సహకరిస్తామని ఎన్ఐసీ హామీ ఇచ్చినట్లు తెలిసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- భారత్xఇంగ్లాండ్ సిరీస్‌లో 'సిక్సర్ల' రికార్డు
పుణెలో జరుగుతున్న మూడో వన్డేలో ఓ రికార్డు నమోదైంది. టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్ పూర్తయ్యేసరికి మొత్తంగా ఈ సిరీస్‌లో ఇరు జట్లు కలిపి 63 సిక్స్‌లు నమోదు చేశాయి. ఫలితంగా అత్యధిక సిక్స్‌లు నమోదైన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌గా ఇది నిలిచింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- గూఢచారిగా రాధికా ఆప్టే-'వై' టీజర్
బాలీవుడ్ నటి రాధికా ఆప్టే తన కొత్త సినిమాలో గూఢచారి పాత్ర పోషించనుంది. 'మిసెస్ అండర్‌కవర్' పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్ర పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. శ్రీకాంత్, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్న థ్రిల్లర్ మూవీ 'వై' టీజర్ విడుదలై ఆకట్టుకుంటోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి