ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7 PM - trending news

ప్రధాన వార్తలు @ 7 PM

ప్రధాన వార్తలు @ 7 PM
ప్రధాన వార్తలు @ 7 PM
author img

By

Published : Mar 24, 2021, 6:59 PM IST

  • ఎస్​ఈసీగా విశ్రాంత ఐఏఎస్ అధికారి శామ్యూల్ వద్దు: వర్ల

విశ్రాంత ఐఏఎస్ అధికారి శామ్యూల్​ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్​గా నియమించవద్దని... తెదేపా నేత వర్ల రామయ్య గవర్నర్​కు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... తన కేసుల్లో సహ నిందితుడిగా ఉన్న శామ్యూల్​ని ఎస్ఈసీగా నియమించాలనుకుంటున్నారని ఆరోపించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • 'బాలల హక్కుల పరిరక్షణలో అనంతపురం బెస్ట్'

బాలల సంరక్షణ కోసం అనంతపురం జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నారని జాతీయ బాలల హక్కుల కమిషన్ సభ్యులు ఆనంద్ ప్రశంసించారు. బాలల హక్కుల పరిరక్షణపై అనంతపురంలో వివిద శాఖల అధికారులతో సమావేశమయ్యారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • 'ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి మోసం చేశారు'

25 మంది ఎంపీలను గెలిపిస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చి మోసం చేశారని.. తెదేపా అధికార ప్రతినిధి మాణిక్యాలరావు అన్నారు. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలో ఏ ముఖం పెట్టుకుని వైకాపా నేతలు ఓటు అడుగుతారని ప్రశ్నించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • విదేశీ విద్యార్థిపై దాడి.. నలుగురు యువకులు అరెస్ట్​

విదేశీ విద్యార్థిపై దాడిచేసిన నలుగురు యువకుల్ని విశాఖ మూడో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

  • చిదంబరం, ఆయన తనయుడికి దిల్లీ కోర్టు సమన్లు

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం, ఆయన తనయుడు కార్తీ చిదంబరానికి దిల్లీ న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. ఏప్రిల్​ 7న కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • నిఖితా హత్యకేసు దోషులకు ఈనెల 26న శిక్ష

హరియాణాలోని ఫరిదాబాద్​లో పరీక్ష రాసి వస్తున్న యువతిని కాల్చి చంపిన కేసులో నిందితులుగా ఉన్న తౌసిఫ్, అతని స్నేహితుడు రెహన్‌లను దోషులుగా తేల్చింది ఫరీదాబాద్​ ఫాస్ట్​ ట్రాక్​ కోర్టు. తీర్పును మార్చి 26న వెలువరించనుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • పండుగల వేళ అప్రమత్తంగా ఉండాలని కేంద్రం లేఖ

దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో కొవిడ్ నిబంధనలపై దృష్టి సారించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది కేంద్రం. రానున్న పండుగల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనకుండా స్థానికంగా ఆంక్షలు విధించాలని సూచించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • టీకా సాయానికి భారత్​కు మారిషస్​ కృతజ్ఞతలు

భారత్​ నుంచి కొవిడ్​ టీకా సాయం అందడంపై మారిషస్​ హర్షం వ్యక్తం చేసింది. భారత ప్రభుత్వానికి ఆ దేశ ప్రధాన మంత్రి ప్రవీంద్​ జగ్​నాథ్​ ధన్యవాదాలు చెప్పారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • ఇంగ్లాడ్​తో వన్డేలకు శ్రేయస్​ దూరం- ఐపీఎల్​కు డౌట్​!

ఇంగ్లాండ్​తో తొలి వన్డేలో గాయపడిన భారత యువ బ్యాట్స్​మెన్​ శ్రేయస్ అయ్యర్​.. మిగతా రెండు వన్డేలకు దూరమయ్యాడు. ఐపీఎల్​ 14వ సీజన్​లోనూ అతడు ఆడేది అనుమానమేనని బీసీసీఐ ప్రకటించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • మంచు తుపానులో ఇరుక్కున్న 'కార్తికేయ 2'

హీరో నిఖిల్​ నటిస్తున్న 'కార్తికేయ 2' షూటింగ్​ను తాత్కాలికంగా నిలిపివేశారు. హిమచల్ ప్రదేశ్​లోని ఓ ప్రాంతంలో షూటింగ్​ జరుగుతుండగా నిఖిల్​ సహా చిత్రబృందం మంచు తుపానులో ఇరుక్కుపోవడమే ఇందుకు కారణం. ఈ వీడియోను మూవీ టీం పోస్ట్​ చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.