- ఘోర రోడ్డు ప్రమాదం
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఔరయ వద్ద రెండు ట్రక్కులు ఢీకొన్న ఘటనలో 24 మంది మృతి చెందారు. వలస కూలీలు రాజస్థాన్ నుంచి బిహార్, ఝార్ఖండ్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...
- మరిన్ని సడలింపులు..
మూడో విడత లాక్డౌన్ గడువు రేపటితో ముగియనుంది. లాక్డౌన్ 4.0 అమలు చేయాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించింది. ఆర్థిక కార్యకలాపాలు పునఃప్రారంభించాలి కనుక మరిన్ని సడలింపులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి..
- 14 రోజులు ఆసుపత్రిలోనే..!
కరోనా వైరస్‌తో ఆస్పత్రుల్లో చేరిన వారికి జ్వరం తగ్గి మూడు రోజులు దాటినా, 14 రోజుల తరువాతే ఇళ్లకు పంపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి
- పచ్చజెండా
మత్స్య, పశుసంవర్ధక శాఖలకు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించుకోవాలని సూచిస్తూ ప్రభుత్వం పలు మార్గదర్శకాలు జారీ చేసింది.ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు ఇచ్చారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి..
- కరోనా పడగ!
కరోనా సంక్షోభంతో వచ్చే ఆరునెలల్లో 118 దిగువ, మధ్యాదాయ దేశాల్లో రోజూ అదనంగా ఆరువేలమంది పసివాళ్లు కడతేరిపోతారని అంచనా. ప్రాణనష్టం అధికంగా సంభవిస్తుందంటున్న 10 దేశాల జాబితాలో భారత్పేరూ ఉంది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి
- లేకుండా చేశాం
వుహాన్‌లో కరోనా వైరస్ పుట్టుకొచ్చిన తొలి రోజుల్లో సేకరించిన నమూనాలను ధ్యంసం చేశామని ఒప్పుకుంది చైనా. గతంలో చైనా ఇన్‌ఫ్లూయెంజా, సార్స్ వైరస్ నమూనాలను ప్రపంచ దేశాలకు అందించిన చైనా కొవిడ్ తొలి నమూనాలను మాత్రం నాశనం చేసినట్లు స్పష్టం చేసింది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...
- జీవ ఆయుధంగా మారితే!
కరోనా వైరస్ ప్రపంచాధిపత్యం కోసం చైనా సృష్టించిన జీవాయుధమని ఓ కుట్ర సిద్ధాంతం వ్యాప్తిలో ఉంది. ఈ వైరస్ వుహాన్ ప్రయోగశాల నుంచి బయటపడిన వైనాన్ని చైనా ప్రభుత్వం కప్పిపెట్టడం వల్ల ప్రపంచానికి ఉపద్రవం దాపురించిందని అమెరికా పాలకులు చేస్తున్న ఆరోపణ కుట్ర సిద్ధాంతానికి బలం చేకూరుస్తోంది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి..
- క్షణాల్లో నేలమట్టం
జర్మనీలో పాత అణు విద్యుత్ కేంద్రంలోని రెండు రియాక్టర్లను గురువారం కూల్చేశారు అధికారులు. 150 మీటర్ల పొడవున్న ఈ టవర్లను ఒక్కసారిగా నేలమట్టం చేశారు . వీడియో కోసం లింక్ క్లిక్ చేయండి..
- అతనే నా కలల రాకుమారుడు
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్‌రోషన్ తన కలల రాకుమారుడని అంటోంది అందాల భామ పూజాహెగ్డే. లాక్డౌన్లో స్వీయనిర్బంధ జీవితంలో మీతో గడిపే సమయాన్ని ఎవరికిస్తారని అడిగిన ప్రశ్నకు ఇలా సమాధామిచ్చింది.పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...
- గరిటె పట్టిన సింధు
లాక్డౌన్ కారణంగా వచ్చిన విరామంలో కొత్త విషయాలను నేర్చుకున్నానంటోంది భారత షట్లర్ పూసర్ల వెంకట సింధు. బ్యాడ్మింటన్ రాకెట్ పట్టాల్సిన చేత్తో వంటిట్లో గరిటె పట్టుకొని సాధన చేస్తున్నట్లు తెలిపింది. మరోవైపు ట్రైనర్ చెప్పిన వ్యాయామాలను క్రమం తప్పకుండా చేస్తున్నాని 'ఈనాడు' ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించింది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి