- వివరాలివే..!
వైద్యుడు సుధాకర్ కేసుపై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుధాకర్ నుంచి జిల్లా మెజిస్ట్రేట్ వాంగ్మూలాన్ని సేకరించారు. అందులోని వివరాలు ఎలా ఉన్నాయంటే.. లింక్ క్లిక్ చేయండి..!
- రంగులు అద్దేశారు..
ప్రభుత్వ కార్యాలయాలు రంగులు వేయవద్దని హైకోర్టు ఆదేశాలిచ్చినా... పరిస్థితిలో మార్పు లేదు. తాజాగా చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో ప్రభుత్వ భవనాలకు రంగులు అద్దారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...
- త్వరలోనే నిర్ణయం..
దేశవ్యాప్తంగా సినిమాహాళ్లన్నీ ఒకేసారి తెరిచేలా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. తెలుగు సినీనిర్మాతలతో వీడియో కాన్ఫరెన్స్‌లో కిషన్ రెడ్డి పలు అంశాలపై మాట్లాడారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...
- కొవిడ్ కోడ్ భాష...!
అవసరానికి మించి సరకులు తెచ్చుకుని ఇంట్లోపెట్టుకనేవారిని ఇడియట్ అంటారు.. కానీ కరోనా కాలంలో అలా చేస్తే 'కొవిడియట్' అంటున్నారు! ఇక బుద్ధిగా నియమాలు పాటించేవారిని ఒబిడియంట్ కాదు.. 'కొవిడియంట్' అంటున్నారు! కరోనా కాలంలో భాషలో వచ్చిన మార్పులెంటో చూద్దాం రండి! కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...
- గర్భిణీల ప్లెసెంటాలో గాయాలు..!
కరోనా వైరస్ బారిన పడిన గర్భిణీల ప్లెసెంటాలో గాయాలవుతున్నట్లు ఓ అధ్యయనం తెలిపింది. వైరస్ సోకిన ఇతర వ్యక్తుల కంటే వారిపైనే ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉందని సూచించింది. ఆ వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి...
- మాస్కులు పెట్టండయ్యా..!
హాయ్! మీరు కరోనా బారి నుంచి తప్పించుకోవడానికి మాస్కులు ధరిస్తున్నారా? నిజానికి వందేళ్ల క్రితమే మాస్కులను విస్తృతంగా వినియోగించారని మీకు తెలుసా?..ఆసక్తికరమైన కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...
- ఐసీసీ సూచనలు
లాక్డౌన్ కారణంగా క్రికెటర్లు ఇంటికే పరిమితమయ్యారు. అయితే బౌలర్లు మళ్లీ క్రికెట్ ఆడేందుకు కనీసం 8 నుంచి 12 వారాల సన్నద్ధత అవసరమని ఐసీసీ తెలిపింది. బౌలర్లు గాయపడకుండా ఉండేందుకు ఐసీసీ చేసిన సూచనలేంటంటే... లింక్ క్లిక్ చేయండి...!
- మరుపురాని మెరుపులు
2003 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్ ఇన్నింగ్స్.. అతని కెరీర్లోనే అత్యుత్తమం. ఒక్క సింపుల్ షాట్‌తో ప్రపంచంలో వేగవంతమైన బౌలర్ అహాన్ని దెబ్బతీశాడు మాస్టర్ బ్లాస్టర్. అలా ఆ మ్యాచ్‌లో భారత్ విజయానికి పునాదులు వేశాడు. కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...
- యాస పలకబోతున్న నాని..
నేచురల్ స్టార్ నాని, సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడని సమాచారం. ఇందులో నాని తెలంగాణ ప్రాంతానికి చెందిన యువకుడిలా కనిపిస్తాడట!. చిత్ర విశేషాల కోసం లింక్ క్లిక్ చేయండి...
- ఫస్ట్ లుక్ ఆఫ్ 'బ్లాక్'
ఆది సాయికుమార్, దర్శనా బానిక్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రానికి 'బ్లాక్' టైటిల్‌ను ఖరారు చేసినట్లు ప్రకటించింది చిత్రబృందం. దీంతో పాటు ఫస్ట్‌లుక్, వర్కింగ్ స్టిల్స్‌ను విడుదల చేసింది. వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి...