- ప్రభుత్వంతో సీపీఎస్ ఉద్యోగుల చర్చలు విఫలం
మంత్రి బొత్సతో సీపీఎస్ ఉద్యోగుల చర్చలు విఫలమయ్యాయి. ప్రభుత్వం పాత విషయాలనే చెప్పిందని సీపీఎస్ ఉద్యోగులన్నారు. ఆందోళనలు కొనసాగుతాయని ఉద్యోగ సంఘ నేతలు తెలిపారు. సెప్టెంబరు 1న చలో విజయవాడ, సీఎంవో ముట్టడి ఉంటుందని వెల్లడించారు.
- CM Jagan on plastic ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విధించిన సీఎం జగన్
CM Jagan on plastic రాష్ట్రంలో నేటినుంచి ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విధిస్తున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. తిరుమలలో ఇప్పటికే ప్లాస్టిక్‌ను నిషేధించామన్నారు. ప్లాస్టిక్ నిషేధంతో తిరుమలలో సత్ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. తిరుమల స్ఫూర్తిగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. 2027 నాటికి ప్లాస్టిక్, పొల్యూషన్ రహిత రాష్ట్రంగా ఏపీ ఉండాలన్నారు.
- లేపాక్షి భూములను రైతులకే ఇవ్వాలంటూ సీఎంకు రామకృష్ణ లేఖ
Ramakrishna letter to CM Jagan లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములను తిరిగి రైతులకు అప్పగించాలంటూ, ముఖ్యమంత్రి జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. 8 వేల 844 ఎకరాల భూములు సేకరించి, వేలాది మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పినా రైతులకు నిరాశే మిగిలిందన్నారు. వివిధ ప్రాజెక్టుల్లో 'రివర్స్ టెండరింగ్' అమలు చేసినట్లే లేపాక్షి భూముల విషయంలో ఎందుకు చేయలేదన్నారు.
- నెల్లూరు జిల్లాలో సినీ ఫక్కీలో చోరీ, చివరి నిమిషంలో
సినిమాల ఎఫెక్ట్ మనుషుల మీద చాలా ఎక్కువగానే కనిపిస్తోంది. సినిమాల్లోనే మాదిరిగానే నిజ జీవితంలోనూ అలాంటి పని చేసి చూపిస్తున్నారు కొందరు. తగ్గేదేలే అంటున్నారు. తమిళ్ హీరో సూర్య 'గ్యాంగ్' సినిమాను చూశారా. అదేనండి సూర్య సీబీఐ ఆఫీసర్‌గా నమ్మించి నగల దుకాణంలోని నగలన్నీ కొట్టేస్తాడు. గుర్తొచ్చిందా. ఇదిగో అచ్చం అలాగే చేసేందుకు ఓ గ్యాంగ్ ప్లాన్ చేసింది. అంతేకాదు రంగంలోకి దిగింది. తీరా పని పూర్తయి సంతోషంగా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కానీ అక్కడే కథ అడ్డం తిరిగింది.
- న్యాయమూర్తి ప్రధాన లక్ష్యం అదే కావాలన్న జస్టిస్ రమణ
CJI NV RAMANA FAREWELL వ్యక్తిగత జీవితంలో అనేక సవాళ్లు ఎదుర్కొని నిలబడ్డానని అన్నారు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ. ప్రతీ పేదవాడికి న్యాయం అందించడమే న్యాయమూర్తి ప్రధాన లక్ష్యం కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ సందర్భంగా సుప్రీంకోర్టు బార్ ఆసోసియేషన్ ఆయనను శుక్రవారం ఘనంగా సన్మానించింది. మరోవైపు జస్టిస్ రమణపై న్యాయవాదులు, తదుపరి సీజేఐ ఉదయ్ ఉమేశ్ లలిత్ సైతం ప్రశంసలు కురిపించారు.
- మన ప్లాన్ ఇది కాదు కదా, ఆజాద్ రాజీనామాపై జీ23 నేతల రియాక్షన్
కాంగ్రెస్ పార్టీకి గులాం నబీ ఆజాద్ రాజీనామాపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు జీ23 నేతలైన ఆనంద్ శర్మ, సందీప్ దీక్షిత్. ఆయన ఇలా చేస్తారని ఊహించలేదని అన్నారు. ఆజాద్ రాజీనామాను వెన్నుపోటుగా అభివర్ణించారు దీక్షిత్.
- మళ్లీ మోదీనే నంబర్ వన్, ప్రపంచ అత్యుత్తమ నేతల్లో టాప్
Modi best pm in the world భారత ప్రధాని నరేంద్ర మోదీని 75 శాతం మంది ప్రజలు ఆమోదిస్తున్నారని అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సర్వే సంస్ధ వెల్లడించింది. ప్రపంచ నాయకులకంటే అధిక ప్రజామోదం ఉన్న నేతగా మోదీనే ముందున్నారని స్పష్టం చేసింది.
- లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ విషయంలో అనుమానాలా, ఇవిగో సమాధానాలు
జీవితంలో అనిశ్చితి వెన్నంటే ఉంటుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళన కన్నా, ఏ పరిస్థితికైనా మనం సిద్ధంగా ఉన్నామా అనేదీ ముఖ్యం. కరోనా మహమ్మారి తర్వాత చాలామంది ఈ ఆర్థిక సూత్రాన్నే పాటిస్తున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా జీవిత బీమా పాలసీల విషయంలో గతంతో పోలిస్తే అవగాహన పెరిగింది. అయినప్పటికీ కొన్ని సందేహాలు వేధిస్తుంటాయి. సాధారణంగా బీమా పాలసీలను ఎంచుకునేటప్పుడు వచ్చే అనుమానాలు, వాటికి సమాధానాలు చూద్దాం.
- ఒక్క మ్యాచ్‌తో మూడు రికార్డులు, వారి ఆశలన్నీ కింగ్ కోహ్లీపైనే
Virat Kohli Records In T20 క్రీడాభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఆదివారం జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన ఘనతను అందుకోనున్నాడు. 100 అంతర్జాతీయ టీ20లు ఆడిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కనున్నాడు.
- ఈ భామల అందాలు అదరహో, చూసేయండి మరి
వివిధ ప్రాంతాలకు చెందిన ఈ తారల అందాలు మతిపొగొడుతున్నాయి. అందరి మనసులను దోచుకుంటున్న ఈ ముద్దుగుమ్మలు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు మీకోసం.
AP TOP NEWS ప్రధాన వార్తలు 9PM - ఏపీ ప్రధాన వార్తలు
ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు
9 pm