- గోరంట్ల మాధవ్ తీరుపై చంద్రబాబు ఘాటు స్పందన.. ఏమన్నారంటే?
వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఘాటుగా స్పందించారు. తప్పులు చేసి కప్పి పుచ్చుకునేందుకు కుల, మతాలను అడ్డు పెట్టుకుంటున్నారని మండిపడిన బాబు.. ముఖ్యమంత్రి బాధ్యతాయుతంగా వ్యవహిరించకపోవడం వల్లే రాష్ట్రంలో దారుణాలు పెరిగిపోతున్నాయని ధ్వజమెత్తారు.
- ఎంపీ గోరంట్ల ఎపిసోడ్.. అనుమానం ఉంది : హోంమంత్రి వనిత
MP Gorantla Video issue: వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత స్పందించారు. మాధవ్ కు చెందినదిగా చెబుతున్న వీడియో ప్రస్తుతం.. ఫోరెన్సిక్ నిపుణుల పరిశీలనలో ఉందని.. నివేదిక రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
- Srisailam: నిండుకుండలా శ్రీశైలం జలాశయం.. 6 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
Srisailam Dam gates: శ్రీశైలం జలాశయం 6 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం నీటిమట్టం 884.80 అడుగులు, నీటి నిల్వ 214.3637 టీఎంసీలుగా నమోదయింది.
- ప్రతి పౌరుడిలో జాతీయతా భావం.. ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా: సోము వీర్రాజు
Azadi ka Amrit Mahotsav:ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలోని ప్రతి ఇంటిపై జాతీయ పతాకం ఎగుర వేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పిలుపునిచ్చారు. విజయవాడ భాజపా రాష్ట్ర కార్యాలయం నుంచి కొత్త వంతెన సెంటర్ వరకు నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొన్న ఆయన.. భాజపా తరపున ఏపీలో 15 లక్షల ఇళ్లపై జెండాలు ఎగరేసేలా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
- 37ఏళ్లుగా ఎమ్మెల్యే కాలేదు.. కానీ 8వసారి సీఎంగా.. దటీజ్ నితీశ్!
Nitish Kumar politics : తన మార్క్ 'పొత్తులాట'తో బిహార్ రాజకీయ ముఖచిత్రాన్ని ఒక్కసారిగా మార్చేశారు జేడీయూ అధినేత నితీశ్ కుమార్. భాజపాకు గుడ్‌బై చెప్పి.. ఆర్జేడీ, కాంగ్రెస్‌తో జట్టు కట్టారు. మహాకూటమి పార్టీల మద్దతుతో మరోమారు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే.. ఇప్పటికే ఏడుసార్లు సీఎం పగ్గాలు చేపట్టినా.. నితీశ్ ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేదని తెలుసా?
- ఆయనకు 75.. ఆమెకు 70.. పెళ్లయిన 54ఏళ్లకు ప్రసవం!
పెళ్లయి 54 ఏళ్లు అవుతున్నా సంతాన భాగ్యం లేని వృద్ధ దంపతుల జీవితంలో అంతులేని సంతోషం నింపారు వైద్యులు. ఐవీఎఫ్ విధానంలో 70 ఏళ్ల మహిళ గర్భం దాల్చేలా చేశారు. సోమవారం ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఫలితంగా వారి కుటుంబం సంబరాల్లో మునిగిపోయింది.
- రాజధానిని ముంచెత్తిన వరద.. 8 మంది బలి
దక్షిణ కొరియా రాజధాని సియోల్‌ను భారీ వరదలు ముంచెత్తాయి. సోమవారం రాత్రి ఇక్కడ కుంభవృష్టి కురియడంతో పల్లపు ప్రాంతాల్లో నీరు చేరింది. ఈ వరదల్లో ఇప్పటి వరకు 8 మంది మృతి చెందగా.. 14 మంది గాయపడ్డారు.
- స్క్రీన్‌షాట్ బ్లాక్, హైడ్ ఆన్లైన్ స్టేటస్.. వాట్సాప్‌లో సూపర్ ఫీచర్స్!
Whatsapp new features today : యూజర్ల ప్రైవసీని దృష్టిలో పెట్టుకుని కీలక మార్పులు చేస్తోంది వాట్సాప్. గ్రూప్‌ల నుంచి సైలెంట్ ఎగ్జిట్, స్క్రీన్‌షాట్ బ్లాకింగ్, రెండు రోజుల తర్వాత కూడా మెసేజ్ 'డిలీట్ ఫర్ ఎవ్రీవన్' వంటి ఆప్షన్లు తీసుకొస్తోంది.
- టీ-20ల్లో నయా సంచలనం.. అద్భుత ప్రదర్శనతో ర్యాంకింగ్స్‌లో దూకుడు
కామన్వెల్త్ గేమ్స్‌లో టీమ్ఇండియా ఆద్యంతం రాణించినా.. ఫైనల్లో చతికిలపడింది. రజతంతో సరిపెట్టుకుంది. అయితే.. భారత మహిళల జట్టులో ఓ ప్లేయర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమెనే రేణుకా సింగ్ ఠాకుర్. ఆ టోర్నీలో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచిన ఆమె.. ఇప్పుడు టీ-20 ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లింది.
- ఆయన సినిమాల్ని టచ్ చేస్తే.. నాకు పెద్ద ఎదురుదెబ్బే: మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ పరంగా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఆమిర్ ఖాన్, నాగచైతన్య నటించిన లాల్‌సింగ్ చద్దా సినిమాను తెలుగులో చిరంజీవి సమర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ చిట్‌చాట్‌లో చిరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ స్టార్ నటుడి సినిమాలను రీమేక్ చేస్తారా అన్న ప్రశ్నకు.. అస్సలు టచ్ చేయనని చెప్పారు. ఇంతకీ ఆ నటుడు ఎవరో తెలుసా?
TOP NEWS: ప్రధాన వార్తలు @ 7PM
ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు
top news 7 pm