ETV Bharat / city

Top news: ప్రధాన వార్తలు @ 5PM - AP NEWS LIVE UPDATES

.

Top news
Top news
author img

By

Published : Nov 27, 2021, 4:58 PM IST

  • Central government team in Tirupati: తిరుపతికి కేంద్ర బృందం.. వరద నష్టం వివరాల సేకరణ
    భారీ వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందం(Central government team in Tirupati) తిరుపతి చేరుకుంది. తిరుపతి నగరంలోని వరద ప్రభావిత ప్రాంతల్లో పర్యటించి, వివరాలు సేకరించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • MISUSING MPLADS FUNDS IN AP: ఎంపీ లాడ్స్ నిధులపై నివేదిక పంపండి.. ఏపీకి కేంద్రం ఆదేశం
    ఎంపీ లాడ్స్ నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం మరోసారి లేఖ రాసింది. నిధుల ఖర్చుపై స్పష్టమైన నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. గతంలోనే ఇవ్వాలని చెప్పినా.. ఏపీ ప్రభుత్వం స్పందించకపోవటంతో తాజాగా కేంద్రం.. ఈ లేఖలను పంపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • Crop damage in west godavari Over heavy rains: నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటాం: మంత్రి కన్నబాబు
    వర్షాలు, వరదలతో పంట (Crop damage Over heavy rains in west godavari) నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటామని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు హామీ ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించిన ఆయన.. పంట నష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • Andhra pradesh Government employees federation: వారంలోగా ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చే అవకాశం: వెంకట్రామిరెడ్డి
    ప్రభుత్వం నుంచి వారంలోగా ఉద్యోగ సంఘాలకు పిలుపు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కె. వెంకట్రామిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. 40 శాతం వరకు ఫిట్​మెంట్ కోరాలని భావిస్తున్నట్లు చెప్పిన ఆయన.. 2020 నుంచి క్యాష్ రూపంలో ఎరియర్స్ ఇవ్వాలని కోరనున్నట్టు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • కాంగ్రెస్​కు టీఎంసీ ఝలక్​- విపక్షాల భేటీకి దూరం
    పార్లమెంట్​ శీతాకాల సమావేశాలకు ముందు కాంగ్రెస్​ పార్టీకి షాక్​ ఇచ్చింది తృణమూల్​ కాంగ్రెస్(trinamool congress)​. ఆ పార్టీ సమన్వయంతో నడిచేందుకు నిరాశక్తత వ్యక్తం చేసింది. ఈనెల 29న కాంగ్రెస్​ తలపెట్టిన ప్రతిపక్షాల సమావేశానికి హాజరుకావటం లేదని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • శబరిమల దర్శనం- పిల్లలకు ఆర్‌టీపీసీఆర్‌ తప్పనిసరి కాదు
    శబరిమల తీర్థయాత్రలో పాల్గొనే చిన్నారులకు ఆర్‌టీపీసీఆర్‌ టెస్టు తప్పనిసరి కాదని కేరళ ప్రభుత్వం తెలిపింది. కరోనా నిబంధనలు మాత్రం తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'ఒమిక్రాన్' పై టీకాలు పనిచేస్తాయ్!
    కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​తో(omicron variant) ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్న క్రమంలో దక్షిణాఫ్రికా ప్రకటన ఊరట కలిగిస్తోంది. ప్రస్తుతం ఉన్న కొవిడ్​ టీకాలు కొత్త వేరియంట్​పై ప్రభావవంతంగానే పనిచేస్తున్నాయని పేర్కొంది ఆ దేశ ఆరోగ్య శాఖ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఆ వాట్సాప్‌ల జోలికెళ్తే.. డేంజర్‌లో పడ్డట్టే!
    ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగిస్తున్న మేసేజింగ్​ యాప్​.. వాట్సాప్(WhatsApp news)​. ఇది యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులో ఉంచుతుంది. అయితే ఇందులో లభించని ఫీచర్లను జత చేసి.. ఏపీకే రూపంలో వాట్సాప్​ నకలను విడుదల చేస్తున్నారు కొందరు సైబర్ నేరగాళ్లు. ఇలాంటివి డౌన్​లోడ్​ చేసుకుంటే డేంజర్​లో పడినట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • IND VS NZ TEST: కివీస్​ 296 ఆలౌట్.. భారత్​ 14/1
    భారత్​తో జరుగుతున్న తొలి టెస్టు(IND vs NZ Test) మొదటి ఇన్నింగ్స్​లో 296 పరుగులకు ఆలౌటైంది న్యూజిలాండ్. టీమ్ఇండియా బౌలర్లలో అక్షర్ పటేల్ 5, అశ్విన్ 3 వికెట్లతో మెరిశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఇకపై నయన్​-విఘ్నేశ్​ మకాం అక్కడే!
    హీరోయిన్​ నయనతార.. రజనీకాంత్‌, ధనుష్‌ వంటి సెలబ్రిటీలు నివసిస్తున్న పోయస్‌ గార్డెన్‌లో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిందని సమాచారం. త్వరలోనే తన ప్రియుడు విఘ్నేశ్​ను వివాహం చేసుకుని ఆమె గృహప్రవేశం​ చేయనుందని తెలిసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.