- ఉదయం 11గంటల వరకు 20.89 శాతం పోలింగ్ నమోదు
కడప జిల్లా బద్వేల్ ఎన్నికల పోలింగ్ ఉదయం 11 గంటల వరకు 20.89 శాతం నమోదైంది. ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- POLLING: హుజూరాబాద్ ఉపఎన్నికలో 11 గంటలకు పోలింగ్ శాతం ఇలా...
ఉత్కంఠ రేపుతున్న తెలంగాణలోని హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్(Huzurabad by election 2021) కొనసాగుతోంది. సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ ఉపఎన్నికల ఫలితాలు నవంబర్ 2న వెల్లడి కానున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- గన్నవరం చేరుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. వెంకయ్యనాయుడుకి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సహా పలువురు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- LOVERS SUICIDE: మనస్తాపంతో ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. యువకుడి మృతి
ఓ ప్రేమజంట మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఘటనలో యువకుడు మరణించగా.. యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన చిత్తూరు జిల్లా కలకడ మండలంలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ఓటర్ల జోరు.. ప్రశాంతంగా 'ఉప'పోరు
దేశంలో మూడు లోక్‌సభ, 29 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది(by election 2021). పలు పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు వేసేందుకు బారులు తీరారు(by election in india). వృద్ధులు సైతం ఓటు వేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. పోలింగ్ కేంద్రాలకు వెళుతున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పోలింగ్ నిర్వహిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- జైలు నుంచి ఆర్యన్ ఖాన్ విడుదల
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్‌ఖాన్ జైలు నుంచి విడుదలయ్యాడు. అయితే ఆర్ధర్ రోడ్ జైలు వద్దకు షారుక్ అభిమానులు భారీగా తరలివచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'అఫ్గాన్ సమస్య మూలకారణాలపై దృష్టిసారించాలి'
ఇటలీ పర్యటనలో (Modi in Italy) ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అఫ్గాన్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశంలోని పరిస్థితులను, అక్కడి నుంచి ఎదురయ్యే సవాళ్లను తీక్షణంగా గమనించాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. అయితే, మానవతా సహాయం మాత్రం అందేలా చూడాలని కోరారు. మరోవైపు, ఇండో పసిఫిక్ అంశంపై ఐరోపా సమాఖ్య నేతలతో చర్చలు జరిపారు. భారత సంతతి (Modi Italy Tour) ప్రజలను కలిశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- తగ్గిన బంగారం ధర- ఏపీ, తెలంగాణలో ఇలా..
బంగారం, వెండి ధరలు (Gold Rate Today) శనివారం స్వల్పంగా తగ్గాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మేలిమి పుత్తడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి..
- Dhoni Pandya: పాండ్యపై ధోనీ నమ్మకం.. అందుకే జట్టులో!
టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో టీమ్ఇండియా కీలక పోరుకు సన్నద్ధమవుతున్న వేళ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ఫిట్‌నెస్‌పై ఆందోళన వ్యక్తమవుతోంది. అతడిని ఎంపిక చేయడం పట్ల పలువురు మాజీలు సెలక్టర్లను తప్పుబడుతున్నారు. అయితే ఐపీఎల్లో పేలవ ప్రదర్శన అనంతరం హార్దిక్‌ను నేరుగా భారత్ తిరిగి పంపించేయాలని సెలక్టర్లు భావించినా మెంటార్ ఎంఎస్ ధోనీ (MS Dhoni Latest News) సూచన మేరకే హార్దిక్‌ను జట్టులో తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- పునీత్ పార్థివ దేహాం వద్ద బాలకృష్ణ కన్నీటి పర్యంతం
నందమూరి బాలకృష్ణ.. హీరో పునీత్ రాజ్‌కుమార్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చుతూ కన్నీటి పర్యంతమయ్యారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి