- వివేకా కేసు.. కడప, పులివెందులలో అనుమానితుల విచారణ
వైఎస్ వివేకా హత్య కేసు(viveka murder case)లో సీబీఐ(CBI) దర్యాప్తు 68వ రోజు కొనసాగుతోంది. కడప, పులివెందులలో పలువురు అనుమానితులను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- విజయసాయి బెయిల్ రద్దుపై నిర్ణయం మీదే: కోర్టులో సీబీఐ మెమో
జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. బెయిల్ రద్దు పిటిషన్‌పై నిర్ణయాన్ని కోర్టుకే సీబీఐ వదిలిపెట్టింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 12 రోజుల్లోనే 50 ఖాళీ జీవోలు ఎందుకిచ్చారు: తెదేపా
ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో అర్ధరాత్రి బ్లాంక్ జీవోలు జారీ చేస్తున్నారని తెలుగుదేశం నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. 12 రోజుల్లో 50 బ్లాంక్ జీవోలు ఇచ్చారని బిశ్వభూషణ్ హరిచందన్ దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం పారదర్శక పాలన చేయడం లేదని నేతలు మండిపడ్డారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- బొబ్బిలి పీఎస్‌లో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
బొబ్బిలి పీఎస్‌లో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మెట్లపై అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను.. సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాల కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- కశ్మీర్లో ఎన్కౌంటర్- ఉగ్రవాది హతం
కశ్మీర్‌లోని కుల్గామ్‌లో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- Delta Plus: రెండు డోసులు తీసుకున్నా.. 'డెల్టా ప్లస్'కు బలి
ముంబయిలో.. కొవిడ్ డెల్టా ప్లస్(Delta Plus) వేరియంట్ తొలి మరణం నమోదైంది. టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ.. 63 ఏళ్ల వృద్ధురాలు ఈ వేరియంట్‌కు బలైనట్లు అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'అత్యాచారం కేసులో వారి మాట చెల్లుతుంది'
ఓ అత్యాచార కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. మానసిక వైకల్యంతో బాధపడుతున్న మహిళపై జరిగిన అత్యాచారం కేసులో ముద్దాయికి శిక్ష ఖరారు చేసింది. జరిగిన దానిని బాధితురాలు వివరించే స్థితిలో లేనప్పటికీ.. ప్రశ్న-సమాధానం రూపంలో సమాచారాన్ని రాబట్టి శిక్ష వేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- చైనా, జపాన్‌లో ముంచెత్తిన వరదలు- 25 మంది మృతి
చైనా, జపాన్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. హుబేయ్ ప్రావిన్స్‌లో.. కురుస్తున్న భారీ వర్షాల ధాటికి 21 మంది ప్రాణాలు కోల్పోగా నలుగురు గల్లంతైనట్లు స్థానిక అధికారులు పేర్కొన్నారు. జపాన్‌లో బురదతో కూడిన వరదతో నలుగురు మృతి చెందారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- లండన్‌తో రాహుల్ లవ్ అఫైర్.. సెంచరీలతో జోరు!
టీమ్‌ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్‌కు లండన్ నగరంతో ఏదో ప్రేమబంధం (లవ్ అఫైర్) ఉన్నట్టుంది! ఎందుకంటే టెస్టుల్లో అతడు చివరి రెండు శతకాలు చేసింది ఈ నగరంలోనే కావడం విశేషం! అదీ మూడేళ్ల అంతరంతో సాధించాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- పుష్ప 'దాక్కో దాక్కో మేక' సాంగ్ వచ్చేసింది
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతోన్న 'పుష్ప' సినిమాలోని తొలి లిరికల్ సాంగ్‌ను విడుదల చేసింది చిత్రబృందం. 'దాక్కో దాక్కో మేక' అంటూ సాగే పాటను ఐదు భాషల్లో రిలీజ్ చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి