ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 9AM - ap top ten news

.

TOP NEWS
TOP NEWS
author img

By

Published : Jul 6, 2021, 9:01 AM IST

  • NGT: రిజర్వాయర్ల నిర్మాణ వివాదంపై జోక్యం చేసుకోలేం.. ఏపీ రైతుల పిటిషన్‌పై ఎన్జీటీ

అనుమతులు లేకుండా గాలేరు- నగరి సుజల స్రవంతి, హంద్రీనీవా సుజల స్రవంతి పథకాల కింద రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టారంటూ చిత్తూరు జిల్లా రైతులు దాఖలు చేసిన పిటిషన్‌లో జోక్యం చేసుకోలేమని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) చెన్నై బెంచ్‌ స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • Exams: ఏపీపీఎస్సీ పరీక్షల్లో ప్రశ్నలు మరింత కఠినంగా ఉంటాయా?

ఏపీపీఏస్సీలో ఇక నుంచి రాత పరీక్షలతోనే అభ్యర్థుల తలరాత మారనుంది. ఇప్పటివరకు రాత పరీక్షల్లో పోటాపోటీగా మార్కులు సాధించినా, మౌఖిక పరీక్షల్లో ముందు, వెనక అవుతున్నారు. ఒకవైపు మౌఖిక పరీక్షలను రద్దుచేయడంతో పాటు.. మరోవైపు గ్రూప్‌-1 మినహా మిగిలిన పోస్టుల భర్తీకి ఒక పరీక్షనే నిర్వహించాలని ఏపీపీఏస్సీ ప్రాథమికంగా నిర్ణయించింది. దీంతో ప్రశ్నపత్రం ఎలా ఉంటుందన్న దానిపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • Polavaram: ‘పోలవరం’ గేట్ల పొడవునా చేరిన నీరు

పోలవరం ప్రాజెక్టు వద్ద అప్రోచ్‌ ఛానల్‌ వెంబడి వేసిన మట్టికట్ట.. సోమవారం మధ్యాహ్నం తెగింది. ఈ క్రమంలో నీరు.. స్పిల్‌వేలోని 48 గేట్ల పొడవునా నీరు చేరిందని.. తెల్లరేసరికి క్రస్టుగేట్ల అన్నింటి పైనుంచి నీరు ప్రవహించే అవకాశం ఉందని గుత్తేదారు ప్రతినిధులు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • Logistics committee: రాష్ట్ర స్థాయి లాజిస్టిక్స్ సమన్వయ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

జాతీయ లాజిస్టిక్స్ పాలసీలో భాగంగా.. రాష్ట్ర స్ఠాయిలో లాజిస్టిక్స్ సమన్వయ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సీఎస్ నేతృత్వంలో.. 11 మంది సభ్యులతో రాష్ట్ర స్థాయి లాజిస్టిక్స్ కో-ఆర్డినేషన్ కమిటీ నియమించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • ఉత్తరాఖండ్‌లో అసమ్మతి సెగలు- భాజపాలో పదవీ పదనిసలు

హిమాలయ రాష్ట్రం ఉత్తరాఖండ్‌ కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్‌ సింగ్‌ ధామి బాధ్యతలు స్వీకరించారు. పార్టీలో, ప్రభుత్వంలో కీలక బాధ్యతలను అప్పగించే సందర్భంలో నాయకుల వ్యక్తిగత పేరుప్రతిష్ఠలు, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోని భాజపా అధిష్ఠానం వైఖరి దీనితో మరోసారి తేటతెల్లమైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 'మాటలు కాదు.. చేతల్లో చూపండి'

భారతీయులందరి డీఎన్‌ఏ ఒక్కటే అని ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ మోహన్ భగవత్​ చేసిన వ్యాఖ్యలపై భిన్నస్పందన ఎదురవుతోంది. ఈ వ్యాఖ్యలను భాజపా స్వాగతించగా.. ప్రతిపక్షాలు 'మాటల్లో కాదు.. చేతల్లో చూపండి' అంటూ విమర్శించాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • నింగిలోకి చైనా అధునాతన ఉపగ్రహం

సౌర, అంతరిక్ష వాతావరణాలను పరిశీలించడానికి ఓ అధునాతన ఉపగ్రహాన్ని ప్రయోగించింది చైనా. విపత్తులపై సమర్థ ముందస్తు హెచ్చరికలు చేయడమే కాకుండా.. మంచు విస్తీర్ణం, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలను పర్యవేక్షించడానికి వీలు కలుగుతుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • చిరుసంస్థలపై ఉరుము లేని పిడుగు

కొత్తగా ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల పరిధిలోకి రిటైల్‌, టోకు వ్యాపారాల్ని చేర్చడం వల్ల బ్యాంకులు వాటివైపే మొగ్గు చూపే అవకాశాలు అధికమంటున్నారు నిపుణులు. అదే జరిగితే తమ శ్రేణిలోకి కొత్తవాటి చేరికవల్ల పరిమిత నిధులకూ నోచని దుస్థితి లఘు పరిశ్రమల్ని మరింతగా కుంగదీస్తుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • Wimbledon: క్వార్టర్స్​లో ఫెదరర్.. అరుదైన రికార్డు

స్టార్​ టెన్నిస్ ప్లేయర్​ రోజర్​ ఫెదరర్​.. వింబుల్డన్ క్వార్టర్స్​లోకి దూసుకెళ్లాడు. ఓపెన్ యుగంలో క్వార్టర్స్​కు అర్హత సాధించిన పెద్ద వయస్కుడిగా ఘనత సాధించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • సుడిగాలి సుధీర్​ మ్యాజిక్.. గెటప్​ శీను మాయం!

సుడిగాలి సుధీర్​ మళ్లీ మ్యాజిక్ చేశాడు. ఇప్పటివరకు ఓ వస్తువును మరో వస్తువుగా మార్చి లేదా మాయం చేసిన అతడు.. ఈసారి ఏకంగా గెటప్​ శీనుతోనే ప్రయోగం చేశాడు. ఎక్స్​ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో ఇదంతా జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.