ETV Bharat / city

ప్రధాన వార్తలు @5PM - ap top ten news

.

top news
top news
author img

By

Published : May 24, 2021, 5:02 PM IST

  • హైవే కిల్లర్‌ మున్నా కేసులో సంచలన తీర్పు.. 12 మందికి ఉరిశిక్ష

కరుడుగట్టిన హంతకుడు. కోడిని చంపినంత తేలిగ్గా మనుషుల పీకలు తెగ్గోస్తాడు . శవాల్ని గోనెసంచుల్లో కట్టి దగ్గర్లోని కాల్వల వద్ద పూడ్చేస్తాడు. ప్రకాశం జిల్లా హైవే కిల్ల‌ర్ మున్నా కేసులో ఒంగోలు 8వ అద‌నపు సెష‌న్స్‌ కోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. 12 మందికి ఉరి శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • విశాఖ మన్యంలో మావోయిస్టుల పేరిట లేఖలు

విశాఖ మన్యంలో మావోయిస్టుల పేరిట లేఖలు వెలిశాయి. ఇందులో ప్రభుత్వం ముందు పలు డిమాండ్లను ఉంచారు. కరోనా ఉద్ధృతి వేళ.. ప్రజలకు ఉచిత వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ ఆస్పత్రులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు వర్షాలు

బంగాళఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తుపాన్​గా మారిందని అమరావతి వాతావరణ సంచాలకురాలు స్టెల్లా తెలిపారు. ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • '18 ప్లస్​'కు టీకా కేంద్రాల్లోనూ రిజిస్ట్రేషన్​!

18 నుంచి 44 ఏళ్లవారికి కొవిడ్ టీకా కోసం.. ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల వద్దే కొవిన్​ పోర్టల్​లో నమోదుకు అనుమతిస్తూ కేంద్రం ప్రకటన జారీ చేసింది. వ్యాక్సిన్ల వృథాను తగ్గించేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • కొవిడ్​ బాధితులకు పరిహారంపై కేంద్రానికి కీలక ఆదేశాలు!

కొవిడ్​తో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు పరిహారం అందించడంపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ విషయంపై వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ మేరకు అఫిడవిట్​ దాఖలు చేయలని పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • జర్నలిస్ట్​ మీదకు యుద్ధ విమానం పంపి అరెస్ట్​

ఓ విలేకరి అరెస్టు కోసం ఆ దేశ ప్రభుత్వం ఏకంగా యుద్ధ విమానాన్ని పంపించింది. అతను ప్రయాణిస్తున్న విమానంలో బాంబు ఉందంటూ దానిని దారి మళ్లించి తమ దేశంలో ల్యాండ్​ అయ్యేలా చేసి.. విలేకరిని అరెస్ట్​ చేసింది. ఈ ఘటన బెలారస్​లో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • భారత్​లో స్పుత్నిక్​ వీ టీకాల ఉత్పత్తి ప్రారంభం

భారత్​లో స్పుత్నిక్​ వీ టీకాల ఉత్పత్తి ప్రారంభించినట్లు ఆర్​డీఐఎఫ్​, పనాసియా బయోటెక్​ సంస్థలు వెల్లడించాయి. త్వరలోనే పూర్తిస్థాయిలో చేపట్టి.. ఏడాదికి 10 కోట్ల చొప్పున డోసులను ఉత్పత్తి చేస్తామని స్పష్టం చేశాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • పసిడి బాండ్ల ఇష్యూ షురూ- గ్రాముకు ఎంత?

2021-22 తొలి విడత పసిడి బాండ్ల ఇష్యూను సోమవారం ప్రారంభించింది ఆర్​బీఐ. ఈ నెల 28 వరకు వీటిని కొనుగోలు చేసే వీలుంది. వీటని ఎలా సబ్​స్క్రైబ్​ చేసుకోవాలి? డిస్కౌంట్ ఎలా పొందాలి అనే పూర్తి వివరాలు మీకోసం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • కొవిడ్ బాధితుల కోసం మరోసారి పాండ్య సోదరులు

కరోనాతో పోరాడుతున్న బాధితులకు సాయం అందించేందుకు మరోసారి ముందుకొచ్చారు క్రికెటర్లు పాండ్య సోదరులు. మరికొన్ని ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • సొంత ఓటీటీ ఆలోచనలో కేరళ ప్రభుత్వం!

ఇటీవల ఎన్నికైన కేరళ కొత్త ప్రభుత్వం సరికొత్త ఆలోచనలతో ప్రజల ముందుకు వస్తోంది. ఇందులో భాగంగానే సొంతంగా ఓటీటీ ప్లాట్​ఫామ్​ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది! పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.