- సోమశిల హైలెవల్ కెనాల్ రెండో దశ పనులకు సీఎం శంకుస్థాపన
సోమశిల హైలెవల్ లిఫ్ట్ కెనాల్ రెండో దశ పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. సాగు, తాగునీరు అందించడమే తమ లక్ష్యమన్న జగన్.. నీటి విషయంలో ఎక్కడా రాజీపడేది లేదని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వీర జవాన్లకు చంద్రబాబు నివాళి
జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పుల్లో వీర మరణం పొందిన జవాన్లకు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు నివాళులర్పించారు. వీర జవాన్ల కుటుంబాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉండాలని కోరుతూ ట్వీట్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఏపీ మంత్రుల కాన్వాయ్కి ప్రమాదం..
ఏపీ మంత్రుల కాన్వాయ్‌లో వాహనాలు ఢీకొన్నాయి. అకస్మాత్తుగా కాన్వాయ్‌లోని మొదటి వాహనం బ్రేక్ వేయడంతో ప్రమాదం జరిగింది. కాన్వాయ్‌లో ఒకదానికొకటి ఢీకొని 3 వాహనాలు ధ్వంసం అయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'కాలుష్య' నగరాల్లో బాణసంచా అమ్మకాలపై నిషేధం
దిల్లీతోపాటు దేశంలోని కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో టపాసుల విక్రయాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్ నిషేధం విధించింది. వాయునాణ్యత మోస్తరుగా ఉన్న ప్రాంతాల్లో హరిత టపాసుల వినియోగించవచ్చని సూచించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మోదీ, నితీశ్‌కూ ట్రంప్‌కు పట్టిన గతే: శివసేన
ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ లాంటి యువనేత ముందు ప్రధాని మోదీ, బిహార్ సీఎం నితీశ్ లాంటివారు నిలువలేరంటూ శివసేన వ్యాఖ్యానించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరాభవం నుంచి భారత్ పాఠాలు నేర్చుకోవాలని సూచించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'పద్ధతి మార్చుకోకపోతే నేరుగా శ్మశానానికే!'
తృణమూల్ కాంగ్రెస్ శ్రేణులను ఉద్దేశించి బంగాల్ భాజపా అధ్యక్షుడు దిలీప్ ఘోష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల లోపు టీఎంసీ కార్యకర్తలు పద్ధతి మార్చుకోకపోతే.. వాళ్ల కాళ్లు, చేతులు విరుగుతాయని, అవసరమైతే శ్మశానానికి వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ధర తక్కువ.. ఆడింది మాత్రం చాలా ఎక్కువ!
ఐపీఎల్ ప్రస్తుత సీజన్లో కొందరు ఆటగాళ్లు.. వాళ్లను కొనుగోలు ధర కంటే చాలారెట్లు న్యాయం చేశారు. తమ జట్టు సాధించిన విజయాల్లోనూ కీలక పాత్ర పోషించారు. ఇంతకీ వాళ్లెవరు? వారి ధరెంత? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వరుణ్ గాయం గురించి సెలక్టర్లకు తెలియదా?
యువ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయం గురించి బీసీసీఐ సెలక్టర్లకు తెలియదని, అందుకే అతడిని ఆస్ట్రేలియా పర్యటన కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. నవంబరు 27 నుంచి భారత్-ఆసీస్ జట్ల మధ్య మ్యాచ్‌లు జరగనున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు చిరంజీవికి కరోనా సోకింది. అయితే లక్షణాలు ఏం లేవని, ప్రస్తుతం హోమ్ క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రావడం లేటైనా.. థియేటర్లలో దుమ్ములేపిన సినిమాలు!
బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు కొన్ని, చిత్రీకరణలు పూర్తిచేసుకున్నా సరే అనివార్య కారణాలో ఏళ్లపాటు విడుదలకు నోచుకోలేకపోయాయి. అనంతరం అవి థియేటర్లలోకి వచ్చిన తర్వాత విశేష ప్రజాదరణ దక్కించుకున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.