- దేశంలో కొత్తగా 34,884 కేసులు.
భారత్‌లో కరోనా కేసులు మరింత ఉద్ధృతంగా పెరిగిపోతున్నాయి. కొత్తగా 34,884 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 671 మంది మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇందులోనూ..మోసమేనా?
క్వారంటైన్ కేంద్రాల్లో సరైన ఆహారం అందించడంలేదని తెదేపా సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ప్రభుత్వం ప్రకటించిన మెనూలో ఏ ఒక్కటి సవ్యంగా అందించడంలేదన్నారు. క్వారంటైన్ కేంద్రాల నుంచి ఇంటికి వెళ్లే వారికి రూ.2 వేలు ఇస్తామన్న ప్రభుత్వం.. ఆ హామీ నిలబెట్టుకోవడంలేదని ఆరోపించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కస్టమర్ సర్వీసులా మారింది..
ఐఏఎస్ అన్నది కొందరిని సంతృప్తిపరిచే కస్టమర్ సర్వీసులా మారిందంటూ సీనియర్ ఐఏఎస్ అధికారి, సీఎం అదనపు ప్రధాన కార్యదర్శి పీవీ రమేశ్ ట్వీట్ చేశారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బోరుమనిపిస్తున్న బోర్లు...
కరవు సీమ అనంతపురంలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. వేలు ఖర్చు చేసి బోర్లు వేసినా చుక్క నీరు కూడా రాకపోవటంతో రైతన్నలు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. వందల అడుగుల లోతులో బోరు వేసినా నీరు ఉండకపోవటంతో కలత చెందుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అందగత్తెల రహస్యం ఇదే...
వివిధ రకాల సౌందర్య ఉత్పత్తులతో తమ అందానికి మెరుగులు దిద్దుకునే మగువలు మన చుట్టూ ఎందరో ఉంటారు. కానీ అందాన్ని పెంచుకోవడానికి ప్రకృతిని మించిన సౌందర్య సాధనం మరొకటి లేదని అంటున్నారు బల్గేరియన్ మగువలు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 6 లక్షలకు చేరువలో మరణాలు..
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. మొత్తం కేసుల సంఖ్య కోటీ 42 లక్షలకు చేరువైంది. దాదాపు 6 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా, బ్రెజిల్, భారత్, రష్యా, పెరు వంటి దేశాల్లో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఎందుకీ దోస్తీ?
అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉన్న వివాదాన్ని సొమ్ము చేసుకోవడానికి చైనా ప్రయత్నిస్తోంది. అందుకే ఇరాన్‌తో భారీ ఒప్పందం చేసుకోవడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం చైనా... ఇరాన్లో 400 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెడుతుంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- హాకీ జట్ల ప్రత్యర్థులు ఎవరంటే?
వచ్చే ఏడాది జులై 24న ఆరంభమయ్యే ఒలింపిక్స్‌కు సంబంధించిన హాకీ షెడ్యూల్ శుక్రవారం విడుదలైంది. భారత పురుషుల జట్టు తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. మహిళల జట్టు నెదర్లాండ్స్‌తో పోటీపడనుంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సెరెనా పునరాగమనం..
అమెరికా టెన్నిస్ తార సెరెనా విలియమ్స్ త్వరలోనే మళ్లీ టెన్నిస్ కోర్టులో కనబడబోతోంది. వచ్చే నెలలో జరిగే కెంటకీ హార్డ్కోర్ట్ టోర్నీలో ఆమె బరిలోకి దిగబోతోంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రణ్‌బీర్‌ను పోలిన యువ మోడల్ మృతి..
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌ను పోలినట్లు ఉంటే మోడల్ జునైద్ షా శుక్రవారం కన్నుమూశాడు. కశ్మీర్‌లోని తన నివాసం వద్ద గుండెపోటుతో మరణించినట్లు షా కుటుంబసభ్యులు తెలిపారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.