- Pawan kalyan: జగన్‌ను ప్రజలు ఎలా నమ్మారో అర్థం కావట్లేదు: పవన్
Pawan kalyan: జనవాణి కార్యక్రమంలో అవినీతి, ఇళ్ల పట్టాలు, మౌలిక వసతుల గురించి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని జనసేనాని అన్నారు. గత ప్రభుత్వం తప్పు చేసిందని చెప్పి అధికారంలోకి వచ్చిన వైకాపా ఇసుక దోపిడీకి పాల్పడుతోందని ప్రజలంటున్నారన్నారు. మేలు చేస్తాడని అధికారం అప్పగిస్తే.. అది భ్రమేనని తేలిపోయిందన్నారు. ప్రభుత్వం అరాచకం మొదలైన రోజు నుంచే జనసేన పోరాటం ప్రారంభమైందని పవన్‌కల్యాణ్ అన్నారు.
- FLOODS: గోదావరి విశ్వరూపం.. లంకలు అతలాకుతలం
వరదగుప్పిట చిక్కుకొని లంక గ్రామాల ప్రజలు దాదాపు వారం రోజులుగా అల్లాడిపోతున్నారు. గోదారమ్మ శాంతించినా వరద ముంపు కొనసాగుతున్న వేళ అష్టకష్టాలు పడుతున్నారు. డాబాలపై తలదాచుకుంటున్న వారిని వరుణుడు మరింత ఇబ్బంది పెడుతున్నాడు. ఆహారం అందక, మూగజీవాలకు మేత లేక సతమతమైపోతున్నారు. కష్టపడి పండించిన పంటలన్నీ నీటిలోనే నానుతుంటే లంక రైతుల కంటనీరు ఆగడం లేదు. సాయం కోసం వరద బాధితులకు ఎదురచూపులే తప్ప ఫలితం దక్కడం లేదు.
- అది మంకీపాక్స్ కాదు... సాధారణ దద్దుర్లే..: వైద్యులు
Monkey Pox: విజయవాడలో మంకీ పాక్స్ అనే అనుమానంతో.. దుబాయ్ నుంచి వచ్చిన ఓ చిన్నారి నమూనాలను అధికారులు పుణె వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. బాలికకు వచ్చింది సాధారణ దద్దుర్లేనని.. వైద్యులు తేల్చారు. కాగా.. చిన్నారికి విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
- కేసీఆర్ "క్లౌడ్ బరస్ట్" కథేంటీ..? ఇది ఆ దేశం పనేనా..? ఇందులో నిజమెంత..?
"క్లౌడ్ బరస్ట్" (Cloudburst)అంటూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశం అయ్యాయి. కుండపోత వర్షాలకు ఏవో కొన్ని కుట్రలు ఉన్నట్లు చెబుతున్నారని.. కేసీఆర్ చేసిన ప్రకటన సంచలనాత్మకమైంది. గతంలోనూ జమ్మూకశ్మీర్‌లోని లేహ్, లద్దాఖ్.. ఉత్తరాఖండ్‌లో ఇలా చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు గోదావరి పరీవాహక ప్రాంతంపై కూడా అలా చేస్తున్నట్లు ఓ సమాచారం వచ్చిందని కీలక వ్యాఖ్యలు చేశారు.
- Live video: ఆకస్మిక వరద బీభత్సం.. రాళ్లను నెట్టుకుంటూ వచ్చి..
వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లా సంగ్లా లోయ వద్ద ఆకస్మికంగా వరద వచ్చింది. లోయలోని రాళ్లను నెట్టుకుంటూ నీళ్లు ముందుకు వచ్చాయి. ఈ దృశ్యాలను అక్కడి స్థానికులు వీడియో తీశారు. కొద్ది సేపట్లోనే అక్కడున్న పరిస్థితులు మారడంతో వీడియోలు తీస్తున్న వారంతా భయాందోళనకు గురయ్యారు. వెంటనే అక్కడి నుంచి వెళ్లడంతో ప్రమాదం తప్పింది.
- రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధం.. ఎన్డీఏకే విజయావకాశాలు
భారతదేశ 15వ రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు సర్వం సిద్ధమైంది. పార్లమెంటు సహా వివిధ రాష్ట్రాల శాసనసభల్లో పోలింగ్ జరగనుండగా పోలింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లను ఈసీ పూర్తి చేసింది. ఉదయం 8గంటలకు..మాక్ పోలింగ్ జరగనుండగా ఆ తర్వాత 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరుగుతుంది.
- ట్విట్టర్ సీఈఓకు మస్క్ వార్నింగ్.. డీల్ రద్దుకు ముందే మెసేజ్?
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, ట్విట్టర్ వివాదంలో తాజాగా మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. డీల్‌ను రద్దు చేసుకోవడానికి ముందే మస్క్.. ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్‌కు ఓ సందేశం పంపినట్లు తెలుస్తోంది. కొనుగోలు కోసం తాను సమీకరిస్తున్న నిధుల వనరులకు సంబంధించిన కీలక సమాచారాన్ని ట్విట్టర్ న్యాయవాదులు అడుగుతున్నారని ఆయన దాంట్లో పేర్కొన్నారు.
- టాలీవుడ్ నిర్మాతల సంచలన నిర్ణయం.. ఆరోజు నుంచి షూటింగ్స్ బంద్!
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు, హీరోహీరోయిన్లు పారితోషికాలు పెంచడం.. తమకూ కనీస వేతనాలు పెంచాలంటూ జూనియర్ ఆర్టిస్ట్‌లు సమ్మెకు దిగడం మొదలైన కారణాల వల్ల భవిష్యత్తులో సినిమాల నిర్మాణంపై నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. సినిమా షూటింగ్‌లను నిరవధికంగా వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
- RC 15: టెన్షన్లో ఫ్యాన్స్!.. ఏం జరిగిందంటే?
RC 15 movie: మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్-దర్శకుడు శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'ఆర్సీ 15' సినిమా విషయంలో ఫ్యాన్స్ కాస్త ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే?
- సింగపూర్ ఓపెన్ విజేతగా సింధు.. ప్రధాని మోదీ అభినందనలు
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సింగపూర్ ఓపెన్ టైటిల్ గెల్చుకుంది. 21-9, 11-21, 21-15 తేడాతో చైనాకు చెందిన వాగ్ యీని ఓడించింది. దీంతో ఈ సీజన్లో తొలి సూపర్ 500 టైటిల్‌ను దక్కించుకుంది డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ అయిన సింధు. ఆసియా ఛాంపియన్షిప్స్ గోల్డ్ మెడలిస్ట్, 22 ఏళ్ల వాంగ్.. సింధు ముందు తేలిపోయింది.