- 'సూచనలు తప్ప..శాసనసభను ఎదిరించే హక్కు మండలికి లేదు'
శాసనసభకు అన్ని అధికారాలు ఉంటాయని.. ఆ సభలో తీసుకున్న నిర్ణయాలు అంతిమమని.. వాటిని అడ్డుకునే అధికారం మండలికి లేదని సభాపతి తమ్మినేని సీతారాం ఉద్ఘాటించారు. శ్రీకాకుళం జిల్లాలోని నారాయణపురం ఆనకట్ట ఆధునికీకరణ పనులను పరిశీలించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- 'అదనపు సమాచారం కోసం అచ్చెన్నాయుడిని కస్టడీకి ఇవ్వండి'
అదనపు సమాచార సేకరణకు అచ్చెన్నాయుడిని కస్టడీకి ఇవ్వాలని అనిశా తరఫు న్యాయవాది అనిశా ప్రత్యేక కోర్టులో వాదనలు వినిపించారు. కాగా...సమాచారం మొత్తం రిమాండ్ రిపోర్టులోనే ఉందని అచ్చెన్నాయుడి తరఫు న్యాయవాది వాదించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల సమావేశం వాయిదా
హైదరాబాద్‌లో రేపు జరగాల్సిన టీఎస్‌ఆర్టీసీ, ఏపీఎస్‌ఆర్టీసీ ఉన్నతాధికారుల సమావేశం వాయిదా పడింది. హైదరాబాద్‌లోని ఆర్టీసీ కార్యాలయంలో కరోనా కేసుల నమోదుతో ఈ భేటీ వాయిదా పడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- అత్తారింట్లోకి దారేది... పది రోజులుగా గేటు వద్దే కోడలు
ఆడపిల్లకు పెళ్లైతే.. అత్తే అమ్మగా చూసుకోవాలి. గడపలో అడుగుపెట్టిన దగ్గరి నుంచి.. కంటికి రెప్పలా.. కోడలిని కాపాడుకోవాలి. విధి ఆడిన నాటకంలో కొడుకు చనిపోతే.. నేనున్నా..అంటూ కోడలికి భరోసానివ్వాలి. కానీ ఓ అత్త మాత్రం.. తన కొడుకు చనిపోతే.. కోడలిని ఇంటికి రానివ్వట్లేదు. చిన్నపిల్లలను చంకనేసుకుని ఆ కోడలు పది రోజులుగా ఆరుబయటే ఉంటోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- 'గూఢచారి' పాక్ విషయంలో భారత్ తీవ్ర నిర్ణయం
దిల్లీలోని పాక్ హైకమిషన్ ఉద్యోగులు గూఢచర్యంతో పాటు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు భారత్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో తమ ఉద్యోగుల సంఖ్యను వారం రోజుల్లోపు 50 శాతానికి తగ్గించాలని సూచించింది. ఈ మేరకు దిల్లీలోని పాక్ హైకమిషనర్‌కు సమన్లు జారీ చేసి, తన నిర్ణయాన్ని తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- పతంజలికి షాక్- 'కరోనిల్' ప్రకటనపై కేంద్రం గుస్సా
కరోనాకు ఆయుర్వేద మందు తీసుకువచ్చినట్లు ప్రకటించిన కాసేపటికే ప్రముఖ దేశీయ కంపెనీ పతంజలికి షాక్ ఇచ్చింది కేంద్రం. ఆ డ్రగ్‌పై అనుమానాలు లేవనెత్తుతూ... సంబంధిత వివరాలు సమర్పించాలని ఆదేశించింది. పూర్తిస్థాయిలో అనుమతి రాకుండా మీడియాలో ప్రకటనలను ప్రసారం చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- వేడి నీళ్లు తాగితే కరోనా పోతుందా?
కరోనా వైరస్ మన ఒంట్లోకి ప్రవేశించినా వెచ్చటి నీళ్లు తాగితే అది పొట్టలోకి వెళ్లిపోతుందని, జబ్బురాదని కొంతమంది భావిస్తున్నారు. ఇంది ఎంతవరకు నిజం..? ఈ కథనం చదవండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ఆ పండు వాసనకు ఆరుగురికి తీవ్ర అనారోగ్యం
డురియన్.. అత్యంత దుర్గంధం వెదజల్లే పండ్లలో ఇదొకటి. ఆస్ట్రేలియా, ఇండోనేషియా, థాయ్‌లాండ్‌లో దొరికే ఈ ఫ్రూట్.. చూడ్డానికి పనస పండులా ఉంటుంది. అయితే ఇది కుళ్లితే ముక్కు భరించలేని వాసన వస్తుంది. తాజాగా దీని వాసన పీల్చి ఆరుగురు ఆస్పత్రికి చేరగా.. 60 మంది ఉన్న ఆఫీస్ ఖాళీ చేయించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- మరో ఏడుగురు పాక్ క్రికెటర్లకు కరోనా
ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికైన మరో ఏడుగురు పాకిస్థాన్ క్రికెటర్లకు కరోనా సోకినట్లు తేలింది. దీనికి సంబంధించి ఆ దేశ క్రికెట్ బోర్డు మంగళవారం అధికారిక ప్రకటన చేసింది. దీంతో ఆ జట్టులో మొత్తం పది మంది ఆటగాళ్లకు వైరస్ నిర్ధరణ అయ్యింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- 'ఆ రహస్యం నీతో పాటే వెళ్లిపోయింది సుశాంత్'
సుశాంత్ మరణించాడనే వార్త తనను ఎంతగానో బాధించిందని నటి భూమిక ఆవేదన చెందారు. ఈ నేపథ్యంలో భూమిక సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ఇకనైనా ఇతరులపై విమర్శలు గుప్పించే పద్దతికి స్వస్థి పలకాలని కోరారు. 'ధోనీ:అన్‌టోల్డ్ స్టోరీ' చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి