- New Districts: ఏపీలో కొత్త జిల్లాలు.. తుది నోటిఫికేషన్ విడుదల
Gazette on New Districts at AP: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 4 తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త జిల్లాలు పరిపాలనా పరంగా కొత్త యూనిట్‌గా మార్పు చెందుతున్నట్టు పేర్కొంది. భౌగోళికంగా మార్పులు చేసిన అన్ని జిల్లాలకు ఏప్రిల్ 4 తేదీ అపాయింటెడ్ డే గా ఉంటుందని స్పష్టం చేసింది. మొత్తం 26 జిల్లాలు, 72 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ.. గెజిట్ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ప్రతీ జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లను, జిల్లా కేంద్రాన్ని పేర్కొంటూ.. వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇచ్చారు.
- AP News: కొత్త ఏడాది మొదటి రోజు నుంచే.. సర్కారు అప్పులతిప్పలు
ap Govt started Efforts on loan: కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజు నుంచే రాష్ట్ర ప్రభుత్వం రుణ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఖాళీ ఖజానాతో అడుగుపెట్టిన సర్కార్.. బహిరంగ మార్కెట్ రుణానికి (ఓఎంబీ) కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అనుమతుల కోసం ఎదురుచూస్తోంది.
- Amaravati: కాలయాపన చేసేందుకే ప్రభుత్వం సాకులు
Government Affidavit on Amaravathi: అమరావతి నిర్మాణం పూర్తి చేయకుండా.. కాలయాపన చేసేందుకే ప్రభుత్వం సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని న్యాయనిపుణులు తెలిపారు. ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ పరిశీలిస్తే..అసలు రాజధాని నిర్మించే ఉద్దేశమే లేనట్లు కనిపిస్తోందంటున్నారు.
- రంజాన్ నెల ప్రారంభం.. ముస్లింలకు పలువురు శుభాకాంక్షలు
Ramzan: ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసం ఆదివారం ప్రారంభం కానుంది. శనివారం సాయంత్రం దేశంలోని పలు ప్రాంతాల్లో నెలవంక కనిపించడంతో నేటి నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభంకానున్నాయని ఫతేపుర్ మసీద్ ఇమాం ముఫ్తీ ముకర్రం అహ్మద్ తెలిపారు. రంజాన్ మాసం జరుపుకోనున్న ముస్లీంలకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు.
- నేటి నుంచే రంజాన్ మాసం.. మోదీ శుభాకాంక్షలు
Ramadan 2022: ముస్లింల పవిత్ర మాసం రంజాన్‌ను పురస్కరించుకుని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర మాసం పేదలకు సేవ చేసేలా ప్రజల్లో స్ఫూర్తిని కలిగించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సమాజంలో శాంతి, సామరస్యం, కరుణ పెంపొందాలని ఆకాంక్షించారు.
- శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం.. అసలేమైంది?.. ఎవరు బాధ్యులు?
Sri Lanka crisis: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రమవుతోంది. కరోనా మహమ్మారి కారణంగా పర్యటకం దెబ్బతినడం వల్ల.. దేశంలో ఆకలి రాజ్యమేలుతోంది. ఆదుకుంటుందని అనుకున్న చైనా.. శ్రీలంకకు హ్యాండ్ ఇచ్చింది. అసలు శ్రీలంకకు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది?
- 'హార్దిక్ పాండ్య అలా అవడానికి కృనాలే కారణం'
Hardik Recovery: టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ఐపీఎల్లో అదరగొడుతున్నాడు. కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్‌ను ముందుండి నడిపిస్తూ.. వ్యక్తిగతంగానూ బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణిస్తున్నాడు.
- మహేశ్, తారక్, బన్నీ.. ఈ స్టార్స్ గురించి దీపిక ఏమందంటే?
Deepika padukone Maheshbabu NTR: స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె తనకు ఇష్టమైన నటుల పేర్లను చెప్పింది. మహేశ్‌బాబు అంటే చాలా ఇష్టమని, ఎన్టీఆర్, అల్లుఅర్జున్‌తో కలిసి నటించాలని ఉందని తన మనసులోని మాటను మరోసారి చెప్పింది. ఇంకా తన గురించి పలు ఆసక్తికర విషయాలను తెలిపింది. ఆ సరదా సంగతులు మీకోసం..