ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 9 AM - ap top ten news

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 9 AM

AP TOP NEWS
ప్రధాన వార్తలు @ 9 AM
author img

By

Published : Mar 22, 2022, 9:00 AM IST

  • వంటింట్లో గ్యాస్​ మంట- భారీగా పెరిగిన సిలిండర్‌ ధర
    Cylinder price: వంటింట్లో గ్యాస్‌ బండ సామాన్యుల గుండెల్లో గుదిబండలా మారింది. ఓవైపు పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసరాల ధరలు మోత మోగుతుంటే.. వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. 14 కేజీల ఎల్​పీజీ సిలిండర్‌ ధరను రూ.50 పెంచాయి. పెంచిన ధరలు మంగళవారం నుంచే అమల్లోకి వచ్చాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఐదు నెలలు తర్వాత పెరిగిన పెట్రోలు, డీజిల్‌ ధరలు- కొత్త రేట్లు ఇవే..
    HIKE IN PETROL AND DIESEL PRICES: దేశంలో ఇంధన ధరలు పెరిగాయి. దాదాపు ఐదు నెలల తర్వాత లీటర్ పెట్రోల్ పై 91 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. డీజిల్​పై 88 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పారిశుద్ధ్య సిబ్బంది మానసిక ఉల్లాసం కోసం... నెల్లూరు కమిషనర్ చిరు ప్రయత్నం
    Dance Therapy Exercise Sizes: నిత్యం పని ఒత్తిడి...! అందులోనూ దుమ్మూధూళిలో విధులు..! కొన్నేళ్లుగా ఒకే పని చేస్తూ విసుగు విరామంతో ఉన్నారు పారిశుద్ధ్య సిబ్బంది. వీరికి కొంత మానసిక ఉల్లాసం కల్పించేందుకు నెల్లూరు నగర కమిషనర్ చిరుప్రయత్నం చేస్తున్నారు. వారితో కలిసి నడవడం. వారితో కలిసి ఆటలు పాటలు పాడటానికి ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Woman Complaint: చనిపోయినట్లు పత్రాలు సృష్టించి.. ఆస్తిని కాజేసి
    Woman Complaint: ఆమెకు పిల్లలు లేకపోవడంతో చెల్లెలు కుమారుడిని పెంచుకుంటూ జీవనం సాగిస్తోంది. అయితే ఆమెకున్న ఆస్తి మీద ఆ కొడుకు కన్నేశాడు. తల్లి చనిపోయిందని నకిలీ పత్రాలు సృష్టించి ఆస్తిని కాజేసి ఆమెను ఇంటి నుంచి తరిమేశాడు. దీంతో 82 ఏళ్ల వృద్ధురాలు కలెక్టర్​ను ఆశ్రయించింది. ఈ హృదయ విదారక ఘటన విశాఖలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Murder: చెల్లిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని.. నరికి చంపిన అన్న
    Man Murder: ఓ వ్యక్తికి మొదటి భార్యతో విభేదాలు ఏర్పడటంతో ఆమెకు దూరంగా ఉంటున్నాడు. అయితే ఖాళీగా ఉండటం ఎందుకని వేరే వ్యక్తి వద్ద ట్రాక్టరు డ్రైవర్​గా పనిలో చేరాడు. ఆ సమయంలోనే ట్రాక్టర్​ యజమాని​ చెల్లిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆ రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. తన వద్ద పని చేసే వ్యక్తి.. తన చెల్లిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కక్షతో అతి దారుణంగా వేట కొడవలితో నరికి చంపాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మనవడిపై తాత లైంగిక దాడి.. 73 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు
    Sexual Assault of Grandson: మనవడిపై ఆమానుషంగా లైగింగ వేధింపులకు పాల్పడిన తాతను ఎట్టకేలకు దోషిగా తేల్చింది కేరళలోని ఓ సెషన్స్​ కోర్టు. అతడికి 73 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మరో ఉదంతంలో ఝార్ఖండ్​లో ఐదేళ్ల చిన్నారిని రేప్​ చేసి, రాళ్లతో కొట్టి హతమార్చాడు ఓ కిరాతకుడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఆ కిట్​లో రబ్బరు పురుషాంగం- ఆశా వర్కర్లు షాక్​
    Rubber Penis Family Planning Kit: కుటుంబ నియంత్రణ కిట్​ లో రబ్బరు పురుషాంగం దర్శనం ఇచ్చింది. దీనిని చూసిన ఆశా వర్కర్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'ఇమ్రాన్​ఖాన్ ఆట ముగిసింది.. అతడే పాక్​ కొత్త ప్రధాని!'
    Maryam Nawaz to Imran Khan: పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్ ఆట ముగిసిందని చెప్పారు పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ (పీఎంఎల్‌) నేత మర్యమ్‌ నవాజ్‌. ఇమ్రాన్​పై ప్రతిపాదిత అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందితే పీఎంఎల్‌ తరఫున షెహ్‌బాజ్‌ షరీఫ్‌ ప్రధాని అభ్యర్థిగా నిలవనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • IPL 2022 Delhi Capitals: యువకుల జట్టు కొట్టేనా కప్పు!
    IPL 2022 Delhi Capitals: గత మూడు సీజన్లలోనూ ప్లేఆఫ్స్‌కు అర్హత.. 2020లో రన్నరప్‌.. జట్టులో ఎక్కువగా యువ ఆటగాళ్లు.. అన్ని విభాగాల్లోనూ పటిష్ఠం.. కానీ ఇప్పటివరకూ టైటిల్‌ కల మాత్రం నెరవేరలేదు. ఐపీఎల్‌లో తొలి కప్పు కోసం నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. ఆ జట్టే.. దిల్లీ క్యాపిటల్స్‌. ఇప్పటివరకూ ఐపీఎల్‌ టైటిల్‌ గెలవని మూడు జట్లలో ఒకటైన దిల్లీ.. ఈ సారి ఆ ముద్ర చెరిపేసుకోవాలనే పట్టుదలతో ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఆ పదిలో.. 'ఆస్కార్‌'ఎవరిని వరించేనో?
    Oscar 2022: ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి సమయం ఆసన్నమైంది. వేడుక కోసం లాస్‌ ఎంజెలిస్‌లోని డాల్బీ థియేటర్‌ చకచకా ముస్తాబవుతోంది. ఈ సారి రేసులో ఉత్తమ చిత్రం విభాగంలో మొత్తం పది పోటీ పడుతున్నాయి. వాటి విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.