ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు @ 9 AM - ap top ten news

'త్వరలో డీఎస్సీ-2020 విశేషాలు.., రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా రికవరీ రేటు.., బ్రహ్మండనాయకుడి బ్రహ్మోత్సవాల విశేషాలు.., తాలిబన్లతో చర్చల్లో మహిళ.., జియో స్మార్ట్‌ఫోన్‌ వచ్చేదెప్పుడు.., ఆర్చర్ విధ్వంసం.., ఇంటికి వెళ్లేందుకు ఆసక్తిగా ఉన్న బాలు.. వంటి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం కింది లింక్ లను క్లిక్ చేయండి..

Top News @ 9 AM
నేటి ప్రధాన వార్తలు
author img

By

Published : Sep 23, 2020, 8:58 AM IST

  • నేడు తిరుమలకు సీఎం: తెదేపా, భాజపా నేతల గృహ నిర్బంధం

ముఖ్యమంత్రి తిరుమల పర్యటన నేపథ్యంలో.. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాలంటూ తెదేపా నేతలు సీఎంను డిమాండ్ చేస్తూ.. నిరసనకు సిద్ధమవడంపై చర్యలు తీసుకున్నారు. తెదేపాతో పాటు.. కొందరు భాజపా నేతలను సైతం గృహనిర్బంధం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • అమిత్​షాతో సీఎం జగన్ భేటీ.. నేడు మరోసారి సమావేశం

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సాయంత్రం భేటీ అయ్యారు. సమావేశ వివరాలను సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించలేదు. భేటీ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను వివరించినట్లు తెలిసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'త్వరలో డీఎస్సీ-2020... ఆధునీకరించిన సిలబస్​తోనే టెట్​ '

డీఎస్సీ-2018కి సంబంధించి కోర్టుల్లో వివాదం పరిష్కారమైందని...విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు.ఎస్జీటీ పోస్టులకు నియామక ప్రక్రియ మొదలుపెట్టామన్నారు. ఉపాధ్యాయుల బదిలీపై రేషనలైజేషన్ సహా అవసరమైన ప్రక్రియ దాదాపు పూర్తయిందని...రెండు, మూడ్రోజుల్లో ఉపాధ్యాయుల బదిలీలపై నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దళిత యువకుడి మృతి కేసు: కౌంటర్ దాఖలుకు హైకోర్ట్ ఆదేశం

ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన దళిత యువకుడు కిరణ్‌ కుమార్‌ మృతి కేసుకు సంబంధించి.. హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దాడి జరిగిన సమయంలో.. పోలీసులపై ఐపీసీ సెక్షన్‌ 324 కింద నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను.. ఆ యువకుడు మృతి చెందాక సెక్షన్‌ 302 (హత్యా నేరానికి శిక్ష) కిందకు ఎందుకు మార్చలేదని ప్రశ్నించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పెరుగుతున్న రికవరీ రేటు... కొత్తగా 7553 మందికి కొవిడ్ పాజిటివ్

కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 7,553 మందికి కరోనా సోకినట్టు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా కేసుల్లో తగ్గుదల నమోదు అవుతున్నా తూర్పుగోదావరి జిల్లా మాత్రం కరోనా హాట్ స్పాట్ కేంద్రంగానే కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • తాలిబన్లతో జరిగే చర్చల్లో తొలిసారి ఒక మహిళ

దశాబ్దాల వివాదానికి ముగింపు పలికే దిశగా అఫ్గాన్ ప్రభుత్వం, తాలిబన్ల మధ్య త్వరలో చర్చలు జరగనున్నాయి. ప్రభుత్వం తరఫున పార్లమెంటు మహిళ సభ్యురాలు ఫౌజియా కోఫీ పాల్గొననుండటం సర్వత్రా ఆసక్తి ఆసక్తి నెలకొంది. ఈ చర్చల్లో ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తారో ఆమె మాటాల్లోనే తెలుసుకుందాం.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • త్రీడీ పరిజ్ఞానంతో మెదడుతో కంప్యూటర్ల అనుసంధానం!

అంతర్జాతీయ నాడీ శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల బృందం మెదడుపై చేసిన పరిశోధనలో కీలక ముందడుగు వేసింది. మానవ మెదడును కంప్యూటర్‌తో అనుసంధానించేందుకు త్రీడీ ముద్రణ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఇంప్లాంట్లను తయారుచేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రూ.4000 లోపే జియో స్మార్ట్‌ఫోన్‌.. వచ్చేదెప్పుడంటే?

టెలికాం దిగ్గజ సంస్థ రిలయన్స్ మరో సంచలనానికి సిద్ధమవుతోంది. రూ.4000 ధరలోనే స్మార్ట్​ఫోన్​ తెచ్చేందుకు స్థానిక తయారీదార్లతో కలిసి రిలయన్స్‌ జియో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే రెండేళ్లలో 20 కోట్ల స్మార్ట్‌ఫోన్లు వినియోగదార్లకు అందించేందుకు వీలుగా.. తయారీ సామర్థ్యం పెంచుకోవాలని చూస్తున్నట్లు బ్లూమ్‌బర్గ్‌ వార్తా సంస్థ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఐపీఎల్​: ఆర్చర్ విధ్వంసం.. 2 బంతుల్లో 27 పరుగులు

ఐపీఎల్​లో చెన్నై సూపర్​కింగ్స్​, రాజస్థాన్​ రాయల్స్​ మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్​లో అద్భుతమైన ఓవర్​ సాగింది. చివరి ఓవర్​లో కేవలం రెండు బంతుల్లోనే 27 పరుగులను సమర్పించుకున్నాడు చెన్నై బౌలర్​ ఎంగిడి. అదేలా సాధ్యమైందో చూడండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నాన్న ఇంటికి వెళ్లాలన్న ఆసక్తితో ఉన్నారు: ఎస్పీ చరణ్

ప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతోందని తెలిపారు ఆయన తనయుడు ఎస్పీ చరణ్​. ఆస్పత్రి నుంచి సాధ్యమైనంత త్వరగా ఇంటికి వెళ్లాలని ఆయన ఆసక్తితో ఉన్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.