ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7 PM - telugu latest news

ప్రధాన వార్తలు @ 7 PM

top news
ప్రధాన వార్తలు @ 7PM
author img

By

Published : May 9, 2021, 6:58 PM IST

  • మంత్రి అప్పలరాజుపై.. కర్నూలు వన్‌టౌన్‌ పీఎస్‌లో ఫిర్యాదు
    మంత్రి అప్పలరాజుపై కర్నూలు వన్ టౌన్ పోలీసు స్టేషన్ పోతురాజు రవికుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఓ టీవీ డిబేట్ లో కర్నూలులో ఎన్ ​440 కే వైరస్ వ్యాప్తి చెందుతోందని, ఈ వైరస్ 15 రెట్లు వేగంగా వ్యాప్తిలో ఉందని మంత్రి వ్యాఖ్యానించారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • చంద్రబాబు మీద తప్పుడు కేసుపై.. సుప్రీం కోర్టుకు వెళ్తాం: అచ్చెన్న
    కరోనా సంక్షోభం వేళ ప్రజల ప్రాణాలు కాపాడటం కంటే.. ప్రతిపక్షాలపై కక్ష తీర్చుకోవడానికే ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విమర్శించారు. "చంద్రబాబు మీద పెట్టిన తప్పుడు కేసుపై.. సుప్రీం కోర్టుకు వెళ్తాం" అని తెలిపారు. ధూళిపాళ్ల నరేంద్ర మొదలు పార్టీ అధినేత వరకు అందరిపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఎస్సై, కానిస్టేబుల్​ ఆత్మహత్యాయత్నం.. ఎందుకు..? ఎక్కడ..?
    గుంటూరు జిల్లాలోని చుండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న ఎస్సై శ్రావణి, అక్కడే కానిస్టేబుల్​గా విధులు నిర్వహిస్తున్న రవీంద్ర పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం ఈ విషయం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉందని ఉన్నతాధికారి తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కొవిడ్​కు గర్భిణి బలి.. ఆక్సిజన్ అందట్లేదని అంతకుముందు సెల్ఫీవీడియో!
    కొవిడ్ ధాటికి బలై ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కంటతడి పెట్టిస్తునే ఉన్నాయి. పడకలు, ఆక్సిజన్ కొరతతో మరణిస్తున్న దయనీయ గాథలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తునే ఉన్నాయి. అలాంటి ఘటనే కాకినాడలో జరిగింది. కరోనా కారణంగా గర్భిణి మృతి చెందినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • జమ్ములో ఉగ్రకుట్ర భగ్నం- 19 గ్రెనేడ్లు స్వాధీనం
    జమ్ముకశ్మీర్​లో ఉగ్రకుట్రను భగ్నం చేశాయి భద్రతా దళాలు. రాష్ట్రీయ రైఫిల్స్, పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టి ఉగ్రస్థావరం నుంచి 19 గ్రెనేడ్​లు స్వాధీనం చేసుకున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'స్వీయ జాగ్రత్తలు పాటిస్తే మూడో దశ ముప్పు తక్కువే'
    దేశంలో ఓ వైపు కరోనా రెండో దశ విజృంభిస్తోన్న తరుణంలో.. మూడో దశ అనివార్యమనే ఆందోళనలు మొదలయ్యాయి. అయితే తగిన నిబంధనలు పాటిస్తూ.. ఎక్కువ మంది జనాభాకు టీకాలు వేస్తే భవిష్యత్​లో వచ్చే కరోనా తీవ్రత తక్కువగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఆ దేశాలకు ఇప్పటికీ అందని టీకా!
    ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. కొవిడ్ కట్టడికై అమెరికా లాంటి అగ్రదేశాలు పూర్తి స్థాయి వ్యాక్సినేషన్​పై దృష్టిసారించాయి. కానీ.. ఇప్పటికీ డజనుకు పైగా దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఆఫ్రికాలోని ఆరు దేశాల్లో కనీసం వైద్యులు కూడా టీకా పొందలేని పరిస్థితిలో ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • వచ్చే నెల 'బ్యాడ్​ బ్యాంక్' షురూ!
    భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థను పీడిస్తున్న ప్రధాన సమస్యల్లో ఎన్​పీఏలు కూడా ఒకటి. ఈ సమస్య నుంచి బ్యాంకులను గట్టెక్కించేందుకు బ్యాడ్​ బ్యాంక్​ను ఏర్పాటు చేయనున్నట్లు బడ్జెట్​లో ప్రకటించింది కేంద్రం. ఈ బ్యాడ్ బ్యాంక్ కార్యకలాపాలు వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఐపీఎల్​: ఇళ్లకు చేరుకున్న ఆ విదేశీ క్రికెటర్లు
    తమ టీమ్​లోని విదేశీ ఆటగాళ్లు స్వస్థలాలకు చేరుకున్నారని ముంబయి ఇండియన్స్ తెలిపింది​. అన్ని ఐపీఎల్​ జట్లలోని న్యూజిలాండ్​ క్రికెటర్లు, సీఫర్ట్​ మినహా స్వదేశానికి చేరుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మదర్స్​డే: అమ్మకు శుభాకాంక్షలు.. సినీ తారల పోస్టులు
    మాతృదినోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో తల్లికి శుభాకాంక్షలు చెప్పారు పలువురు సినీ తారలు. వాళ్లతో దిగిన అపురూప చిత్రాల్ని అభిమానులతో పంచుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.