- 'అమలాపురం ఘటనలో పోలీసుల తీరు.. ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు నిదర్శనం'
అమలాపురం ఘటన, అనంతర పరిస్థితులపై హోంమంత్రి తానేటి వనిత డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డితో సమీక్ష నిర్వహించారు. నిన్నటి ఘటనలో ఆందోళనకారులు దాడి చేస్తున్నా.. ఎదురుదాడి చేయకుండా పోలీసులు సంయమనం పాటించారన్నారు. పోలీసులు వ్యవహరించిన తీరు ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు నిదర్శనమని తెలిపారు.
- YSRCP Ministers: 'అమలాపురం అల్లర్లకు వారే కారణం'
ప్రశాంతంగా ఉండే కోనసీమలో చంద్రబాబు, పవన్ అలజడి సృష్టిస్తున్నారని మంత్రులు దాడిశెట్టి రాజా, అంబటి రాంబాబు మండిపడ్డారు. దాడుల వెనుక ఎలాంటి సంఘవిద్రోహ శక్తులున్నా ఉపేక్షించేది లేదన్నారు.
- పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది: ఎంపీ రఘురామరాజు
అమలాపురంలో అంత విధ్వంసం జరిగినా ఒక్క ఫైరింజన్ కూడా ఎందుకు రాలేదని వైకాపా రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసమే ఇదంతా జరిగిందేమోనని ప్రజలు అనుకుంటున్నారన్నారు.
- మాపై నేరం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు: పవన్‌కల్యాణ్
Pawan kalyan: జిల్లాల పేర్లు పెట్టేటప్పుడే అంబేడ్కర్ పేరు పెట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంత్రి విశ్వరూప్ ఇంటిపై దాడి జరుగుతుంటే పోలీసులు చూస్తూ ఉంటారా? అని ప్రశ్నించారు. కులసమీకరణతో రాజకీయాలు చేస్తారా? అని ధ్వజమెత్తారు. భావోద్వేగాలు ఉంటాయని తెలిసే రెచ్చగొట్టారని ఆరోపించారు. ఈ ఘటనకు వైకాపా ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు.
- CRDA: 'హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగానే అమరావతిలో పనులు'
APCRDA would abide by the High Court Orders: హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగానే అమరావతిలో పనులు జరుగుతున్నాయని సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ వెల్లడించారు. నవంబర్ నాటికి రాజధానిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఖిల భారత సర్వీసు అధికారుల నివాసాలకు సంబంధించి పనులు పూర్తి అవుతాయన్నారు.
- నిర్వాసితులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది: సోము వీర్రాజు
Somu veerraju: నీటి ప్రాజెక్టుల నిర్వాసితులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని నిలదీశారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
- చిదంబరం మెడకు మరో ఉచ్చు.. వీసా కుంభకోణంపై ఈడీ కేసు
Chinese visa scam: చైనీస్ వీసా కుంభకోణం కేసులో కార్తీ చిదంబరం చుట్టూ ఈడీ ఉచ్చు బిగుసుకుంటోంది. నిబంధనలను ఉల్లంఘిస్తూ చైనా జాతీయులకు వీసాలు పొందడంలో సహాయం చేశారనే ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ కేసు నమోదు చేసుకుంది.
- వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ కోసం పాక్ కుళ్లు రాజకీయం
Pak Letter To UNO: జమ్ముకశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌ను తక్షణమే నిర్దోషిగా ప్రకటించి.. జైలు నుంచి విడుదల చేయాలని పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ.. ఐరాస మానవహక్కుల హైకమిషనర్‌కు లేఖ రాశారు. కశ్మీరీలను తప్పుడు కేసుల్లో ఇరికించడానికి భారత్ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.
- 'సీతారామం' రిలీజ్ డేట్.. 'ఎఫ్ 3' మేకింగ్ వీడియో.. 'డాన్' 100కోట్లు
కొత్త సినిమా అప్డేట్స్ వచ్చాయి. దుల్కర్ సల్మాన్ 'సీతారామం' విడుదల తేదీ ఖరారైంది. వెంకటేశ్,వరుణ్‌తేజ్ 'ఎఫ్ 3' మూవీ మేకింగ్ వీడియో కూడా రిలీజ్ అయి తెగ నవ్వులు పూయిస్తోంది. ఇక కమల్‌హాసన్ 'విక్రమ్' సినిమా నుంచి ఓ కొత్త పాటను షేర్ చేశారు మేకర్స్. శివకార్తికేయన్ నటించిన 'డాన్' మూవీ కలెక్షన్ల పరంగా రూ.100కోట్ల క్లబ్లో అడుగుపెట్టింది.