Lokesh: ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక నేరగాడు జగన్మోహన్ రెడ్డి: లోకేశ్
సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిపై తెదేపా ముఖ్యనేత నారా లోకేశ్(Lokesh) హాట్ హాట్ కామెంట్స్ చేశారు. ఆఫ్ షోర్ కంపెనీలు, పెట్టుబడిదారుల సామ్రాజ్యాన్ని ఏ1 జగన్మోహన్ రెడ్డి సృష్టిస్తే... క్విడ్ ప్రోకో మనీ లాండరింగ్ ప్రక్రియ ఏ2 నిర్వర్తించారని ట్విట్టర్ వేదికగా విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
Anandaiah: ఔషధ తయారీని త్వరలోనే ప్రారంభిస్తాం: ఆనందయ్య
కరోనా మందు పంపిణీపై నెల్లూరులో కలెక్టర్ చక్రధర్‌బాబుతో ఆనందయ్య సమావేశమయ్యారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఔషధ పంపిణీ ఉంటుందని ఆనందయ్య వెల్లడించారు. కరోనా మందు ప్రక్రియ పూర్తైతే, సోమవారం నుంచే మందు పంపిణీ ప్రారంభిస్తామన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
Anandayya Medicine: ఆనందయ్య ఔషధం తయారీకి ముమ్మర ఏర్పాట్లు!
కృష్ణపట్నంలో ఆనందయ్య మందు తయారీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వాధికారుల సూచనతో... ఆనందయ్య బృందం ఔషధం తయారీకి సన్నాహాలు చేస్తోంది. వికేంద్రీకరణ పద్ధతి, ఆన్‌లైన్ ద్వారా నాలుగైదు రోజుల్లో ఔషధ పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'ఆనందయ్య మందు తితిదే ఆధ్వర్యంలో తయారు చేసే అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా'
తిరుపతి తుడా కార్యాలయంలో కొవిడ్‌పై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆనందయ్య ఔషధాన్ని తితిదే ఆధ్వర్యంలో తయారు చేసే అంశంపై తితిదే ఛైర్మన్, సీఎం జగన్‌తో చర్చిస్తానన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'జగన్ బెయిల్ రద్దు' పిటిషన్‌పై.. విచారణ వాయిదా
అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ సీబీఐ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌పై న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
mercy killing: అరుణమ్మ కన్నీటి కథ.. ఈ కడుపుకోత మరెవరికీ రాకూడదు..!
'అయ్యా..! అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కుమారుడు ముక్కు నుంచి రక్తం కారే.. అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. అయిదేళ్ల నుంచి అతడిని బతికించడానికి చేసిన చికిత్స కోసం ఉన్నదంతా ఖర్చుపెట్టేశాం. ఎన్నో ఆసుపత్రులు తిప్పాం. ఇక లాభం లేదు.. మా వల్ల కాదని డాక్టర్లు చేతులెత్తేశారు. నా కుమారుడు బతుకుతాడేమోనని ఎన్నో దేవుళ్లకు ప్రార్థించా. ఆ ప్రార్థనలు ఫలించలేదు. నా బిడ్డ బాధను చూడలేకపోతున్నాం. గుండె తరుక్కుపోతోంది.. జడ్జి గారూ..! మీరే ఏదో నిర్ణయం తీసుకోండి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'కరెన్సీ'తో చైనా కొత్త స్కెచ్- అమలైతే అంతే...
చైనా మరోసారి కరెన్సీ మ్యానిప్యులేటింగ్కు పాల్పడుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల యువాన్ విలువ గణనీయంగా పెరగడం పట్ల ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విదేశీ కరెన్సీ నిల్వలను పెంచుకోవాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2డీజీ డ్రగ్ వాడాలా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
2డీజీ ఔషధాన్ని ఇష్టారీతిలో వినియోగించకూడదని డీఆర్డీఓ స్పష్టం చేసింది. వైద్యుల పర్యవేక్షణలోనే దీనిని తీసుకోవాలని కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
RRR: ఒక్క పాట కోసం నెలరోజులు షూటింగ్!
'ఆర్ఆర్ఆర్'(RRR) సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుందని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కేవలం రెండు పాటలు(rrr songs) మినహా మిగిలిన షూటింగ్‌ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. కానీ, ఈ పాటల చిత్రీకరణకు 50 రోజుల సమయం పడుతుందని టాక్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'Dhoni : ఫ్యాన్స్‌ను చూసి బుర్ర పనిచేయలేదు'
భారత్‌లో చెన్నైసూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీపై ఫ్యాన్స్ చూపిస్తున్న ఆదరణ చూసి తన మెదడు పనిచెయ్యలేదని అన్నాడు ఇంగ్లాండ్ క్రికెటర్ సామ్ బిల్లింగ్స్. మహీ సారథ్యంలో ఆడటం తాను గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.