- CM Jagan: కుప్పం మున్సిపాలిటీ గెలుస్తామనుకున్నామా?: సీఎం జగన్
CM Jagan: వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాలు సాధించాలని వైకాపా అధినేత, సీఎం జగన్ పునరుద్ఘాటించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రులు, వైకాపా ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జులతో నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు.
- Pawan kalyan: ప్రభుత్వ వైఫల్యాలకు విద్యార్థులను ఫెయిల్ చేశారు: పవన్ కల్యాణ్
Pawan kalyan: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలకు పదో తరగతి విద్యార్థులను ఫెయిల్ చేశారని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. ప్రజలు, రైతులు, నిరుద్యోగులను ఎలానూ సంతోషపెట్టలేని ప్రభుత్వం.. కనీసం పిల్లలకు సరైన చదువైనా చెప్పించి ప్రయోజకులుగా తీర్చిదిద్దలేరా అని నిలదీశారు. గ్రేస్ మార్కులు ఇచ్చి విద్యార్థుల భవిష్యత్ కాపాడాలని కోరారు.
- CRUISE SHIP: నేటి నుంచే సముద్ర విహారనౌక ప్రయాణం..!
CRUISE SHIP: అత్యాధునిక హంగులు..ఫైవ్‌స్టార్ హోటల్ సౌకర్యాలతో కూడిన కార్డీలియా క్రూయిజ్ విశాఖ సముద్ర జలాల్లోకి అందుబాటులోకి వచ్చింది. నేడు ప్రయాణికులతో బయలుదేరనున్న ఈ విహార నౌక.. నాలుగు రోజుల తర్వాత తిరిగి విశాఖ చేరుకోనుంది.
- చీకట్లో చినగంజాం... మూడు రోజులవుతున్నా పునరుద్ధరించని విద్యుత్ సరఫరా...
Non-restoration of the power supply: ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు బాపట్ల జిల్లా పర్చూరు నియోజక వర్గంలోని చినగంజాం మండలంలో అంధకారం నెలకొంది. ఈనెల 5న మండలంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్షం ప్రభావంతో వివిధ ప్రాంతాల్లో దాదాపు 110 విద్యుత్తు స్తంభాలు విరిగిపడ్డాయి . 150 ఇన్సులేటర్లు దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి చినగంజాంలో కరెంటు సరఫరా పునరుద్ధరించకపోవడంతో.. ప్రజలు చీకట్లోనే మగ్గుతూ..అవస్థలు పడుతున్నారు.
- 'విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారా?.. ఏం సాధించారు?'
నీట్ పీజీ సీట్ల భర్తీకి సంబంధించి.. భారత వైద్యమండలి వైఖరిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సీట్లను ఖాళీగా ఉంచి ఏం సాధించారని ప్రశ్నించింది. పీజీ సీట్ల భర్తీ, ఖాళీలపై తక్షణమే అఫిడవిట్ వేయాలని చెప్పింది.
- సవతి తల్లి చిత్రహింసలు.. అన్నం పెట్టమని అడిగిన చిన్నారి చేతులు కాల్చి..
అమ్మా.. ఆకలేస్తుంది..అన్నం పెట్టు అని అడిగినందుకు చిన్నారిని చిత్ర హింసలకు గురిచేసి వాతలు పెట్టింది సవతి తల్లి. ఈ అమానవీయ ఘటన కర్ణాటకలో జరిగింది. మరోవైపు, బెంగళూరుకు చెందిన ఓ మహిళ.. చీటీలు కట్టి రూ.25 లక్షలు పోగొట్టుకున్నందుకు తన భర్త రోజూ మందలిస్తున్నాడని అతడి హత్యకు ప్లాన్ చేసింది. ప్రయత్నం విఫలమై చివరకు కటకటాలపాలైంది.
- లోయలోకి దూసుకెళ్లిన వ్యాను... 18 మంది మృతి
ACCIDENT IN PAKISTAN: పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కొండ ప్రాంతంలోని ఇరుకైన రోడ్డుపై వేగంగా వెళ్తున్న ఓ వ్యాను.. లోయలో పడిపోయింది. వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రయాణికులెవరూ ప్రాణాలతో బయటపడలేదని అధికారులు తెలిపారు.
- కోచ్‌పై లైంగిక ఆరోపణలు.. భారత సైక్లిస్ట్ బృందం రిటర్న్
కోచ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఓ మహిళా సైక్లిస్ట్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం స్లొవేనియాలో ఉన్న ఆ బృందం తక్షణమే భారత్‌కు తిరిగి రావాలని సాయ్ ఆదేశించింది.
- నయన్-విఘ్నేశ్ వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో వైరల్
Nayantara-Vignesh marriage wedding card: నయనతార-విఘ్నేశ్ శివన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దాన్ని నెటిజన్లు ట్రెండ్ చేస్తున్నారు. మీరు చూసేయండి..