- విజయవాడలో సీతమ్మవారి విగ్రహం ధ్వంసం!
రాష్ట్రంలో విగ్రహాల విధ్వంసం కొనసాగుతోంది. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్దనున్న సీతారామ మందిరంలో... సీతమ్మవారి విగ్రహం ధ్వంసం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వైకాపా వర్గపోరు: కడప జిల్లాలో ఎనిమిది మంది అరెస్టు
కడప జిల్లా పాయసంపల్లెలో వర్గపోరుతో.. వైకాపా నేతలు ఘర్షణ పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి 8 మందిపై కేసు నమోదు అయింది. నిమ్మకాయల సుధాకర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు మహేశ్వర్‌రెడ్డి వర్గంపై కేసు నమోదు చేశారు పోలీసులు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద నిరంతరం నిఘా: డీజీపీ
ఆలయాల్లో ఘటనల దృష్ట్యా పోలీసు సహా అన్ని శాఖలు అప్రమత్తమైనట్టు డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. ఆలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద నిరంతరం నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇంటింటికీ ఏపీఎస్ఆర్టీసీ కార్గో సేవలు
ఇటీవల కాలంలో కరోనా వల్ల తీవ్ర నష్టాలతో సతమతమవుతున్న ఏపీఎస్ఆర్టీసీ... ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు వీలైన మార్గాలు అన్వేషిస్తోంది. ఈ మేరకు కార్గోలు, పార్సిల్ బుకింగ్‌లకు ఆర్టీసీ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టబోతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దేశంలో కొత్తగా 18,177 కేసులు, 217 మరణాలు
దేశంలో కొత్తగా 18,177 మందికి వైరస్ సోకింది. మరో 217 మంది మరణించారు. వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 96.16 శాతానికి చేరుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రపంచాన్ని చుట్టేస్తోన్న కరోనా స్ట్రెయిన్
మరో రూపాన్ని ధరించిన కరోనా ప్రపంచాన్ని చుట్టేస్తుంది. చూస్తుండగానే 30 దేశాలకు వ్యాపించింది. సిద్ధమైన వాక్సిన్ అందరికీ చేరేలోగా ఈ వైరస్ మరో విడత విజృంభించేలా ఉందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 2 కార్లు ఢీ.. ఏడుగురు చిన్నారులు సజీవదహనం
అమెరికా కాలిఫోర్నియాలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీ కొని మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ కారులో మంటలు చెలరేగి అందులో ఉన్న ఏడుగురు చిన్నారులు, ఓ మహిళ సజీవ దహనమయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'దశాబ్దపు టీ20 జట్టులో ధోనీ ఎందుకు?'
ఐసీసీ ప్రకటించిన ఈ దశాబ్దపు టీ20జట్టుపై మాజీ క్రికెటర్ ఆకాశ్‌చోప్రా అనుమానం వ్యక్తం చేశాడు. గత పదేళ్లలో ధోనీ సహ భారత్, టీ20ల్లో సాధించిందేమి లేదన్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- హిందు దేవుళ్లను కించపరిచిన కమెడియన్ అరెస్టు
హిందు దేవుళ్లపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఓ స్టాండప్ కమెడియన్‌ను గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడిని రిమాండ్‌కు తరలించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- టాలీవుడ్.. పాన్ఇండియా కేరాఫ్ అడ్రస్!
పాన్ ఇండియా చిత్రాలకు టాలీవుడ్ కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ఇక్కడి హీరోలు జాతీయ స్థాయిలో చిత్రాలను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. 'బాహుబలి' ఇచ్చిన జోష్‌తో భాషాభేదం లేకుండా తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకీ ఆ హీరోలెవరు? ఆ సినిమాలేంటి? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.