- చంద్రబాబు సీఎం అయ్యాక రాజకీయ సన్యాసం తీసుకుంటా: జేసీ ప్రభాకర్‌రెడ్డి
JC Prabhakar: చంద్రదండు ప్రకాష్ నాయుడుపై రౌడీషీట్ ఓపెన్ చేయడాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి తప్పుపట్టారు. ప్రజా సమస్యలపై పోరాడుతుంటే రౌడీషీట్ ఓపెన్ చేసినా భయపడబోనని జేసీ స్పష్టం చేశారు. చంద్రబాబును సీఎం చేసిన తర్వాత.. రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు.
- Flexi Issue: నెల్లూరు వైకాపాలో విభేదాలు..! ఎంపీ వేమిరెడ్డి ఫ్లెక్సీ తొలగింపు
Flexi Issue: నెల్లూరులో వైకాపా ఫ్లెక్సీల గొడవ రోజురోజుకీ రచ్చకెక్కుతోంది. తాజాగా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫ్లెక్సీలను.. నిన్నరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చించివేశారు. ఎంపీ వేమిరెడ్డి ఫ్లెక్సీలను చించి వేయడంపై.. అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- Snake: సోమశిల గురుకుల పాఠశాలలో పాము.. ధైర్యం చేసి చంపిన విద్యార్థులు
Snake: పిల్లలంతా నిద్రలో ఉన్నారు... ఎక్కడినుంచి వచ్చిందో తెలియదు.. ఐదడుగుల పాము వాళ్లు నిద్రిస్తున్న గదిలోకి దూరింది.. పామును చూసి పిల్లలంతా నిద్రలేచారు... కొందరు భయపడి బయటకు పరుగులు తీశారు.. మరికొంతమంది ధైర్యం చేసి ఆ పామును చంపేశారు... ఈ ఘటన సోమశిల గురుకుల పాఠశాలలో నెలకొంది.
- Governor Tamilisai On Trolling: 'మహిళను ట్రోల్ చేయడం తగునా?'
Governor Tamilisai On Trolling: ప్రజల చేత ఎన్నికైనందున తామే అధికులమనే భావన సరికాదని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. తనకు అందిన సమాచారాన్ని కేంద్రానికి నివేదికల రూపంలో పంపుతానని స్పష్టం చేశారు. మహిళను ట్రోల్ చేయడం తగదని పేర్కొన్నారు.
- Hyderabad Pub Case: టోనీ నుంచే పుడింగ్ పబ్‌కు డ్రగ్స్
Drug Dealer Tony : తెలంగాణలో మాదకద్రవ్యాల వ్యాపారం నిర్వహిస్తున్న నైజీరియన్ టోనీ కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. టోనీ నుంచి కొకైన్ తీసుకున్న హైదరాబాదీయుల్లో కొందరికి పుడింగ్ అండ్ మింక్ పబ్ నిర్వాహకులతో పరిచయాలున్నట్లు పోలీసులకు పలు ఆధారాలు లభించాయి. తీగ లాగితే డొంక కదిలినట్లు.. టోనీ కేసు దర్యాప్తు చేస్తే.. పుడింగ్ అండ్ మింక్ పబ్‌కు సంబంధించి కీలక ఆధారాలు బయట పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
- కొత్త రూల్.. బైక్‌పై బ్యాక్ సీట్లో పురుషులు కూర్చోవద్దు!
Male Pillion Riders on Two-wheelers Banned: ఆర్ఎస్ఎస్ కార్యకర్త హత్య కేసు నేపథ్యంలో జిల్లాలో కీలక ఆదేశాలు జారీ చేశారు కేరళలోని పాలక్కడ్ అడిషన్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్. జిల్లాలో ద్విచక్రవాహనంపై వెనుక సీటులో పురుషులు ప్రయాణించడంపై నిషేధం విధించారు.
- క్రిప్టో కరెన్సీపై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు
Crypto currency news: క్రిప్టో కరెన్సీ వినియోగంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఉగ్రవాద నిధులకు ఉపయోగించే ముప్ప పొంచి ఉందన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా ఓ సెమినార్లో మాట్లాడారు.
- ఫించ్‌తో మాటల యుద్ధం.. భారత క్రికెటర్‌పై నెటిజన్ల ఆగ్రహం!
IPL 2022: ఐపీఎల్లో కోల్‌కతా ఓపెనర్ ఆరోన్ ఫించ్‌తో మాటల యుద్ధానికి దిగాడు రాజస్థాన్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ. దీంతో అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
- మాల్దీవుల్లో రాఖీభాయ్.. అర్ధరాత్రి చార్మినార్‌కు రాజమౌళి
KGF 2 Yash Maldives: 'కేజీఎఫ్ 2' విజయోత్సాహంలో కుటుంబంతో కలిసి మాల్దీవులకు వెళ్లారు కన్నడ రాకింగ్ స్టార్ యశ్. దీనికి సంబంధించిన ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారగా.. దీన్ని చూసిన అభిమానులు లైక్స్, కామెంట్స్‌తో సోషల్‌మీడియాను హోరెత్తిస్తున్నారు. మరోవైపు దర్శకుడు రాజమౌళి.. హైదరాబాద్‌లోని చార్మినార్‌ను సాధరణ వ్యక్తిలా సందర్శించారు.